Kabaddi: నాచురల్ స్టార్ నాని నటించిన అద్భతమైన సినిమాల్లో ‘భీమిలి కబడ్డీ జట్టు’ ఒకటి. ఇది తమిళ రీమేక్ అయినప్పటికి తెలుగులోనూ ఒరిజినల్ లాంటి అనుభూతినిచ్చింది. నానితో పాటు మిగిలిన అందరూ నాచురల్ నటించారు. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవల్సింది క్లైమాక్స్. చాలా తమిళ సినిమాల్లోలాగానే.. ఈ సినిమాలో కూడా హీరో చనిపోతాడు. కబడ్డీ కోర్టులో కూతకు వెళ్లి ప్రాణాలు విడుస్తాడు. తాజాగా, అచ్చం ఇలాంటి సంఘటనే ఒకటి తమిళనాడులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, సేలం జిల్లాలోని కొడంపులియార్కు చెందిన విమల్ రాజ్ సేలం టౌన్లో బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సేలంలోని ఓ కబడ్డీ అకాడమీలో కబడ్డీ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. జులై 24వ తేదీ రాత్రి మండికుప్పంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో విమల్ రాజ్ పాల్గొన్నాడు. ఆట జోరుగా సాగుతోంది. విమల్ రాజ్ ప్రత్యర్థుల కోర్టులోకి కూతకు వెళ్లాడు. లోపలికి వెళ్లి తిరిగి వస్తూ ప్రత్యర్థుల నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించాడు. వారిపైనుంచి ఎగిరి ముందుకు దూకాడు. అదే సమయంలో ఓ ప్రత్యర్థి ఆటగాడు విమల్‌పై పడ్డాడు. విమల్ కూత ఆపేయటంతో ఆ ప్రత్యర్థి పైకి లేచి పక్కకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత విమల్ కూడా పైకి లేవటానికి ప్రయత్నించాడు. కానీ, వల్ల కాలేదు.. అక్కడే కుప్పకూలాడు. తోటి ఆటగాళ్లు, నిర్వహకులు అతడ్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. విమల్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించాడని స్పష్టం చేశారు. విమల్ మరణానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. మరి, విమల్ మృతిపై మీ సంతాపాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండ. ఇవి కూడా చదవండి : Rahul Gandhi: సోనియా విచారణకు వ్యతిరేకంగా నిరసన.. రాహుల్ గాంధీని అరెస్ట్ చేసిన పోలీసులు!