ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఒక వింత సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి స్వామి కలియుగంలో జరిగే వింతలు, విశేషాల గురించి కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు.. అవి ఇప్పుడు మన కళ్ల ముందు జరుగుతున్నాయి. చింత చెట్టుకి చామంతి పూలు, పందికి ఆవు దూడ, మూడు కన్నులు ఉన్న దూడ, ఆవు పంది పిల్లకు పాలు ఇవ్వడం, మేక కడుపున మనిషిలాంటి శిశువు జన్మించడం ఇలా ఏదోక వింత సంఘటలు జరుగుతూనే ఉన్నాయి.
తాజాగా బీహార్‌కి చెందిన ఓ మహిళ నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్న శిశువుకు జన్మనిచ్చింది. శిశువుకు నాలుగు కాళ్లు, నాలుగు చేతులు ఉండడంతో వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. ఆ శిశువును చూసేందుకు ఆసుపత్రికి వద్దకు జనం క్యూ కడుతున్నారు. బీహార్‌లోని కతిహార్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కతిహార్‌లోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఆ మహిళ కు నొప్పులు రావడంతో సదర్ ఆసుపత్రికి వెళ్లింది. అక్కడి వైద్యులు సర్జరీ ద్వారా ఆమెకు డెలివరీ చేశారు. నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో కూడిన శిశువు జన్మించడంతో మహిళ భర్త షాక్ తిన్నాడు.
ఇది చదవండి : సినీ ఇండ్రస్టీలో విషాదం.. రైలు ప్రమాదంలో ఆర్టిస్టు మృతి
ఈ విషయం గురించి మాట్లాడుతూ.. నిజానికి ఆమె కవలలకు జన్మనివ్వాల్సి ఉందని, గర్భస్థ పిండం ఎదుగుదల సరిగా లేకపోవడం వల్లే ఇలా జరిగిందని వైద్యులు తెలిపారు. ఇదేం వింత శిశువు కాదని సదర్ ఆస్పత్రి మహిళా వైద్యురాలు శశికిరణ్ అన్నారు. అయితే, వైద్య చికిత్సలో లోపం వల్లే ఇలా జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇదంతా దైవలీల అని, శిశువును భగవంతుడు అవతారంగా భావించి పూజలు, ప్రార్థనలు చేయడం గమనార్హం. ఈ విషయం గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.