Woman Gives Birth To Baby In Toilet: మతిస్థిమితం సరిగా లేని ఓ మహిళ టాయిలెట్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. టాయిలెట్‌కు వెళ్లిన సమయంలో పుట్టిన బిడ్డ కమోడ్‌లో ఇరుక్కుపోయింది. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది బిడ్డను క్షేమంగా బయటకు తీశారు. ఈ సంఘటన గుజరాత్‌లో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఓ మహిళ గర్భంతో ఉంది. సదరు మహిళకు మతిస్థిమితం సరిగా లేకపోవటంతో ఆమెను మహిళల సంరక్షణకోసం ఏర్పాటు చేసిన డెవలప్‌మెంట్ హోమ్‌లో ఉంచారు. గురువారం ఆమె టాయిలెట్‌కు వెళ్లింది. అక్కడ టాయిలెట్ సీటులోనే బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ టాయిలెట్ సీటులోని కమోడ్‌లో ఇర్కుపోయింది.
విషయం తెలుసుకున్న అక్కడివారు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. టాయిలెట్‌లోని టైల్స్ అన్నీ విరగొట్టారు. ఆ వెంటనే నీళ్ల పైపులైను కట్ చేశారు. దీంతో కమోడ్‌లోకి నీళ్లు పోవటం ఆగిపోయింది. బిడ్డకు ఎలాంటి హానీ జరగకుండా కమోడ్‌ను విరగొట్టారు. క్షేమంగా బిడ్డను బయటకు తీశారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బిడ్డ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : పింఛను కోసం జవాన్ భార్య 56 ఏళ్ల న్యాయపోరాటం.. కోర్టు సంచలన తీర్పు!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి