ఈ మధ్యకాలంలో ఫేస్ బుక్ పరిచయాలు ఎలా ఉంటున్నాయో చూస్తున్నాం. ముక్కు, ముఖం తెలియని వారితో స్నేహం ఎక్కువవుతోంది. ఫలితంగా కొందరికి జరగరాని నష్టం జరిగిపోతోంది. ఎవరు ఎంత అప్రమత్తం చేసినా.. ఎవరు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా ఈ మోసాలు నానాటికీ పెరుగుతున్నాయి. తాజాగా ఓ 50 ఏళ్ల ఆంటీ.. ఫేస్ బుక్ లో అందమైన యువతి ఫొటో పెట్టి యువకుడిని ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపింది. అతడి నుంచి రూ.3.50 లక్షలు కొట్టేసింది. ఇదే ఆంటీ ఇచ్చిన ట్విస్టు అనుకుంటే.. మరో ట్విస్ట్ కూడా ఇచ్చింది. తన పిన్నిని పంపిస్తున్నానంటూ.. ఆమే..అతడి వద్దకు వచ్చి డబ్బులు తీసుకెళ్లింది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
కర్ణాటక రాష్ట్రంలోని మండ్య జిల్లా నాగమంగళ తాలూకా లోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి ఫేస్ బుక్ ద్వారా ఓ అందమైన యువతి ఫోటోతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. తరువాత అటువైపు నుంచి ఆడ వాళ్ల మాటాలే రావడంతో యువకుడు నమ్మాడు. ఇద్దరి మధ్య మాటమాట కలిసింది. చివరికి ఆమెను ఎట్లైనా కలవాలని నిర్ణయించుకున్నాడు. ఆ విషయాన్ని ఆ యువతి తెలిపాడు. అమ్మో! వస్తే ఇంకేమైనా ఉందా? మా అమ్మానాన్నలు చూశారంటే అసలుకే ఎసరు వస్తుందని చెప్పింది. దీంతో ఆమెను కలిసే ప్రయత్నాన్ని అతడు విరమించుకున్నాడు. యువకుడు ఆమెను పెళ్లి చేసుకుంటాన్ని చెప్పాడు. దీనికి ఆమె కూడా సరేనంది. పెళ్లి విషయం మాట్లాడేందుకు తన చిన్నమ్మను పంపుతున్నట్టు చెప్పింది.
ఇదీ చదవండి: మామతో ప్రేమలో పడ్డ కోడలు.. భర్త, ఇద్దరు పిల్లల్ని వదిలేసి జంప్!
అనుకున్నట్టుగానే ఓ రోజు ఆ యువతి పినతల్లి యువకుడి ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో ఇంట్లో వారికి తెలియకుండా యువకుడు ఆమె చేతిలో రూ.3.50 లక్షలు పెట్టాడు. ఆదిచుంచనగరి మఠంలో పెళ్లికి ఏర్పాట్ల జరిగాయి. ఈక్రమంలో పెళ్లికి వచ్చిన యువతి “పినతల్లి”.. పెళ్లి కుమార్తెను ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పడంతో అందరూ షాక్ కి గురయ్యారు. అయితే, ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఆమె చెప్పిన విషయాలకు పోలీసులే విస్తుపోయారు.
అది ఏమిటంటే..ఫేస్ బుక్ లో యువకుడికి యువతిగా పరిచయమైనది ఈ పిన్నతల్లిగా వచ్చిన 50ఏళ్ల ఆంటీనే. ఫోటో మార్ఫింగ్ చేసి మోసం చేసినట్లు ఆంటీ అంగీకరించింది. కాబట్టి ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ పట్ల అప్రమత్తంగా లేకుంటే “బుక్” అయిపోవడం ఖాయం అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరి.. ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.