భూమి మీద జీవించే ప్రతి ప్రాణికి గాలితో పాటు నీరు చాలా ముఖ్యం. నీటికోసం దేశాల, రాష్ట్రాల మధ్య యుద్ధాలు సైతం జరుగుతుంటాయి. అనేక ప్రాంతాల్లో నీటి కొరత అక్కడి వారిని తీవ్రంగా వేధిస్తుంది. గుక్కెడు నీళ్ల కోసం మైళ్ల దూరం నడుచుకుంటూ వెళ్తుంటారు. మనదేశంలోను అనేక ప్రాంతాల్లో నీటి కొరత ప్రధాన సమస్యగా ఉంది. గుక్కెడు నీళ్ల కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎండిపోయిన బావిలో మహిళలు దిగడటమే నీటి కొరతకు నిదర్శనం. కొందరు మహిళ నీటి కోసం మెట్లు లేని ఆ బావి గోడను పట్టుకుని దిగి, పైకి ఎక్కుతున్నారు. ఈ ఘటన సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మధ్యప్రదేశ్ లోని షుసియా గ్రామ ప్రజలను నీటి కోరత తీవ్రంగా వేధిస్తుంది. తాగునీటి కోసం ఆ గ్రామ ప్రజలు ప్రాణాలకు తెగించాల్సి వస్తోంది. గుక్కెడు నీటి కోసం చాలా దూరం వెళ్లి ఎండిపోయిన బావిలోకి తాడు కట్టుకుని దిగి నీటిని తోడుకుంటారు. తిరిగి అదే తాడు సాయంతో బావి నుంచి బయటకి వస్తుంటారు. అప్పుడప్పుడు తాడు తెగి కొందరికి గాయాలైనట్లు పాలవుతున్నారు. అయిన తాగునీటి కోసం ఆ గ్రామ ప్రజలు అలా పొరాటం చేయక తప్పడం లేదు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇదే తరహాలో తీవ్ర నీటికొరత నెలకొంది. ఈ పరిస్థితిపై ఘుసియా గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయటం కోసం.. ఈ ఏడాది జరుగబోయే స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తామని వారు చెప్పారు.
ఇదీ చదవండి: ప్రభుత్వ అధికారి నిర్వాకం.. ఆఫీసులో బిన్ లాడెన్ ఫొటో..నీళ్లు తెచ్చుకోవటానికి తాము బావిలోకి దిగాల్సి వస్తోందని, ఇక్కడ ఉన్న మూడు బావులు దాదాపుగా ఎండిపోయాయని, చేతి పంపు బోర్లలోనూ నీళ్లు లేవు అని స్థానిక మహిళలు తెలిపారు. అయితే నీటి కోసం ఎన్నో అవస్థలు పడుతున్న ఈ మహిళల వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. ఈ వీడియో గుండెలను పిండి చేస్తోందని చాలా మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ గ్రామానికి తక్షణమే సాయం చేయాలని స్థానిక అధికారులను కోరారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#WATCH | Madhya Pradesh: People in Dindori’s Ghusiya village risk their lives to fetch water from an almost dry well pic.twitter.com/jcuyLmE5xL
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 2, 2022
“Govt employees and political leaders only come during elections. This time we have decided not to give votes until we have a proper water supply. We have to go down the well to collect water. There are 3 wells, all have almost dried, no hand pumps have water,” said locals pic.twitter.com/lJvagevwxU
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 2, 2022