మనదేశంలో కోర్టు ఇచ్చే తీర్పుల గురించి అందరికి తెలిసిందే. ఏదైనా ఓ విషయంలో కోర్టు మెట్లు ఎక్కితే చాలు.. ఇక అంతే. ఎప్పుటి తీర్పు వస్తుందో ఎవరు చెప్పలేరు. ఈ లోపు ఇరువైపుల వారు ఆస్తులను, ఆప్తులను కొల్పోతుంటారు. బ్రిటీష్ కాలంలో మొదలైన ఓ భూవివాదం..108 ఏళ్ల తర్వాత తీర్పు వచ్చింది. తీర్పు వచ్చేసరికి ఇరుకుటుంబాల్లోని చాలా మంది మరణించారు. భారత్ లో సుదీర్ఘకాలం నడిచిన కేసుల్లో ఒకటిగా భావిస్తున్న ఈ కేసులో ఎట్టలేకలకు తీర్పు వెలువడింది. మరి.. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
బ్రిటీష్ హయంలో బీహార్ లోని భోజ్ పుర్ జిల్లా కొయిల్వార్ అజ్ హర్ ఖాన్ అనే వ్యక్తి 9 ఎకరాల స్థలం ఉండేది. ఇందులో అతని వారసుల నుంచి సేకరించిన మూడు ఎకరాల స్థలం విషయమై రాజ్ పూత్ కుటుంబంతో వివాదం నెలకొంది. రాజీ కుదుర్చుకునేందుకు ఉభయ పక్షాలు ససేమిరా అంగీకరించలేదు. దీంతో 1914లో ఆరా సివిలో కోర్టులో కేసు వేశాడు. దీంతో కేసు విచారణ అప్పటి నుంచి శతాబ్ధానికి పైగా సాగుతూ వచ్చింది. ఎన్నో విచారణల అనంతరం ఈ కేసు వేసిన దర్బారీసింగ్ మునిమనుమడు అతుల్ సింగ్ తదితరులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. భోజపుర్ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్వేతాసింగ్ మార్చి 11న తీర్పు వెలువరించారు.“1914 నుంచి సుదీర్ఘకాలం పాటు విచారణ సాగడంతో రెండు కుటుంబాలు కొన్ని తరాల వారసులను కోల్పోయాయి. ఇప్పటికైనా ఈ వివాదానికి తెర దించాల్సిన అవసముంది. అయినా, ఇది ఇక్కడితో ఆగుతుందని చెప్పలేము” తీర్పు వెలువరిచే సందర్భంలో జడ్జీ వ్యాఖ్యానించారు. మరి… భారత్ దేశంలోని ఇలాంటి సుదీర్ఘకాలం కొనసాగుతున్న కేసుల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.