దేశంలో మహిళలపై జరుగుతున్న దారుణాలు అన్నీ ఇన్నీ కావు. ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట.. మహిళపై అత్యాచారం, అత్యాచారం చేసి ఆపై హత్య.. వంటి వార్తలు నిత్యం వినపడుతూనే ఉన్నాయి. వీటిని అరికట్టడానికి పోలీస్ యంత్రాంగ శాయశక్తులా ప్రయత్నిస్తుంటే.. తాజా ఓ స్వామీజీ.. మహిళల్ని బహిరంగంగా రేప్ చేస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ ఘటన యూపీలోని, సీతాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఖైరాబాద్ పట్టణంలో ఓ జీపులో ప్రచారం నిర్వహిస్తున్న స్వామీజీ.. అక్కడి ప్రజల్ని ఉద్దేశించి మైకులో మాట్లాడారు. ఎవరైనా ముస్లిం వ్యక్తి స్థానిక మహిళల్ని వేధిస్తే, అప్పుడు ముస్లిం మహిళల్ని కిడ్నాప్ చేసి రేప్ చేస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. స్వామీజీ మాటలు విన్న జనం.. వాడి వ్యాఖ్యలకు కేరింతలు కొడుతూ జై శ్రీ రామ్ అంటూ నినాదాలు చేశారు. తనను మర్డర్ చేసేందుకు కొందరు కుట్ర పన్నారని, దాని కోసం 28 లక్షలు కూడా సేకరించినట్లు ఆయన ఆరోపించారు. ఈ వీడియోను ఆల్ట్ న్యూస్ ఫౌండర్ జుబైర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ప్రస్తుతం స్వామీజీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏప్రిల్ 2న ఈ ఘటన చోటు చేసుకుంది.
TRIGGER WARNING!
A Mahant in front of a Masjid in the presence of Police personals warns that He would K!dnap Muslim Women and ₹@pe them in Open.According to the locals near Sheshe wali Masjid, Khairabad, Sitapur. This happened on 2nd Apr 2022, 2 PM. @sitapurpolice @Uppolice pic.twitter.com/wkBNLnqUW0
— Mohammed Zubair (@zoo_bear) April 7, 2022
ఇది కూడా చదవండి: పిల్లనిచ్చిన అత్తతో అల్లుడి చీకటి సంసారం.. కానీ అదొక్కటి మిస్సయ్యారు!
పోలీసు సిబ్బంది సమక్షంలోనే.. ఓ స్వామీజీ ఇలా రేప్ చేస్తానంటూ వ్యాఖ్యలు చేసినా ఇంత వరకు చర్యలు తీసుకోలేదన్నది అసలు విషయం. ఈ ఘటన పట్ల ఓ సీనియర్ అధికారి స్పందిస్తూ.. విచారణ చేపడుతున్నారని, నిజ నిర్ధారణ జరిగిన తర్వాత చర్యలు తీసుకుంటామని సీతాపూర్ పోలీసులు తెలిపారు. ముస్లిం మహిళలకు వీడియోలో హెచ్చరికలు చేసిన స్వామీజీని భజరంగ్ మునిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
जनपद सीतापुर के वायरल वीडियो का संज्ञान लेकर @sitapurpolice द्वारा अभियोग पंजीकृत किया गया है। उक्त अभियोग में साक्ष्य के आधार पर नियमानुसार विधिक कार्यवाही किये जाने के निर्देश दिये गये हैं।@adgzonelucknow @Igrangelucknow
— UP POLICE (@Uppolice) April 8, 2022
ఇది కూడా చదవండి: పిల్లల ముందే తల్లి ప్రియుడితో సరసాలు.. అంతటితో ఆగక!