ఈ మద్య నిర్మాణంలో ఉన్న బ్రిడ్జీలు ఉన్నట్టుండి కూలిపోవడంతో కొన్నిసార్లు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది. నిర్మాణ విలువలు సరిగా పాటించకపోవడం వల్లనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీహార్‌లోని భాగల్‌పూర్‌లో ఏర్పాటు చేస్తున్న ఒక వంతెన్న ఉన్నట్టుండి కుప్ప కూలిపోయింది. వాహనాల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఖగారియా, భాగల్‌పూర్ జిల్లాలను కలుపుతూ నాలుగు లైన్ల వంతెనను నిర్మిస్తున్నారు. ఇటీవల వచ్చిన పెను గాలులకు ఈ వంతెన కూలిపోవడం గమనార్హం. ఈ వంతెన ఖరీదు సుమారు పదిహేడు కోట్లకు పై మాటే అంటున్నారు.
ఈ బ్రిడ్జీ నిర్మాణం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. శుక్రవారం వచ్చిన ఈదురు గాలులు.. పెద్ద పెద్ద ఉరుములతో భారీగా వర్షం పడింది. దాంతో ఈ వంతెనలో సగభాగం కుప్పకూలిపోయింది. కాకపోతే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. కాగా, ఈ వంతెన నిర్మాణం 2015న ప్రారంభమైంది. ఈ వంతెన నిర్మాణం జరిగితే ప్రజలకు ఎంతో సౌలభ్యం ఉండేది. కానీ ఈ వంతెన నిర్మాణదశలోనే కూలిపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
వంతెన అర్ధాంతరం కూలిపోయిన విషయం తెలుసుకున్న సుల్తాన్‌గంజ్ జేడీయూ ఎమ్మెల్యే లలిత్ నారాయణ్ మండల్ పరిశీలించారు. ఇది కేవలం నాణ్యతా లోపం వల్ల వల్ల జరిగిన పొరపాటు అని విమర్శించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, దీనిపై దర్యాప్తు జరుపుతామని అన్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.