భూ ఆక్రమణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివుడు.. కోర్టు విచారణకు హాజరయ్యాడు. వినడానికి వింతగా, విడ్డూరంగా ఉన్న ఇది నిజం. పరమశివుడితో పాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 9 మంది కూడా కోర్టుకు హాజరయ్యారు. మరి దేవుడేంటి.. విచారణకు రావడం ఏమిటి అనేక కదా మీ సందేహం. దానికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ కేసు పూర్వపరాల్లోకి వెళ్తే..ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని రాయ్ గఢ్ లోని 25వ వార్డుకు చెందిన రజ్వాడే అనే వ్యక్తి ఇటీవల ప్రభుత్వ భూమి ఆక్రమణపై బిలాస్‌పూర్ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశాడు. ఆ ప్రభుత్వ భూమిలో శివాలయంతో సహా 10 మంది కక్షిదారులుగా పేర్కొన్నారు. ఈ పిటీషన్ ను విచారించిన హైకోర్టు పూర్తి స్తాయి దర్యాప్తు జరిపి వివరాలు తెలియజేయాలని రాష్ట్ర్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో వెంటనే స్పందించిన ప్రభుత్వం అధికారులను విచారణకు పంపింది.
కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన తహసీల్దార్ కార్యాలయం ప్రాథమిక విచారణ ప్రారంభించి 10 మందికి నోటీసులిచ్చింది. ఈ నెల 25న జరగనున్న విచారణకు హాజరై భూకబ్జా ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో నోటీసులు అందుకున్న శివుడితోపాటు 9 మంది కోర్టు విచారణకు హాజరయ్యారు. గుడిలోని శివలింగాన్ని రిక్షాలో కోర్టుకు తీసుకొచ్చి హాజరు పరిచారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.