త్రివేండ్రం- మన దేశంలో పెళ్లికి ఎంతో మహోన్నతమైన స్థానం ఉంది. పవిత్రమైన వివాహ బంధానికి ఎంతో విలువ, గౌరవం ఉన్నాయి. అదే క్రమంలో పెళ్లైన తరువాత సమాజంలో చాలా కట్టుబాట్లను సైతం మరిచిపోవద్దు. ఐతే ఈ మధ్య కాలంలో వివాహ బంధాన్ని పక్కనపెట్టి కొంత మంది వివాహేతర సంబంధాలను పెట్టుకుని బరితెగిస్తున్నారు.
ఇక మరికొంత మంది స్నేహం ముసుగులో యువతి, యువకులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండతంటో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. కేరళలో దాదాపు ఇలాంటిదే అయినా, ఇందుకు కాస్త భిన్నమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. కేరళలోని కరుచాకల్ కు చెందిన ఒక వ్యక్తి తన భార్యను లైంగికంగా వేధించేవాడు. ఆమెకు ఇష్టం లేకున్నా బలవంతం చేసేవాడు.
ఈ రీతిలో ప్రతిరోజు భార్య ఇష్టానికి వ్యతిరేకంగా ఆమె పట్ల పశువుగా ప్రవర్తించేవాడు. ఈ క్రమంలో అతను మరికొంతమందితో కలిసి ఒక గ్యాంగ్ గా ఏర్పడ్డారు. ఈ గ్యాంగ్‌లో మొత్తం ఏడుగురు సభ్యులు గ్రూపుగా ఏర్పడి దారుణానికి పాల్పడటం మొదలుపెట్టారు. మొదట మనం చెప్పుకున్న వ్యక్తి తన భార్యను అందరితో లైంగిక చర్యకు సహకరించాలని బలవంతం చేశాడు. అంతే కాదు ఈ గ్రూపులోని సభ్యులు తమ భార్యలను ఒకరితో మరొకరు మార్చుకుంటూ లైంగికంగా మితిమీరి ప్రవరించేవారు.
ఈ క్రమంలో ఆ మహిళ వేరే వ్యక్తులతో సంబంధాలకు నిరాకరించింది. భర్త చేష్టలతో విసిగిపోయిన సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దిగారు. పోలీసులు విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడుగురు సబ్యుల గ్యాంగ్ టెలిగ్రామ్, మెసెంజర్ లతో సంప్రదించుకునేవారని పోలీసులు గుర్తించారు.
వీరి పార్ట్‌నర్ స్వాపింగ్ చాట్ గ్రూపులో వేలాది మంది యువతి, యువకులున్నట్లు గుర్తించారు. గత ఆదివారం నిందితులను కొట్టాయం, అలప్పుజ, ఎర్నాకులం జిల్లాల నుంచి అరెస్టు చేశారు. ఈ పార్టనర్ స్వాపింగ్ రాకెట్ పూర్తి గుట్టును విప్పేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి విచారణ చేపట్టారు. కేరళలో ఈ కేసులు ఇప్పుడు సంచలనం రేపుతోంది.