ఈ మధ్యకాలంలో దొంగలు మరి బరితెగిస్తున్నారు. సామన్య ప్రజల నుంచి రాజకీయ నాయకుల వరకూ ఎవరినీ వదలకుండా కొందరు దొంగతనాలకు పాల్పడుతున్నారు. అయితే ఇటీవల ఏపీ మంత్రి రోజా మొబైల్ ఫోన్ ఎత్తికెళ్లిన విషయం మరువకముందే తాజాగా ఉత్తరప్రదేశ్ లోని ఓ ఎమ్మెల్యే బూట్లు చోరీ చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఫతేహాబాద్ శాసనసభ్యుడు ఛోటేలాల్ వర్మ ఆగ్రాలో సతీమాత ఉత్సవాలను ప్రారంభించేందుకు ఆలయానికి తరలివెళ్లారు. దీంతో ఆయన అభిమానులతో పాటు భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చారు.
ఇది కూడా చదవండి: మంత్రి రోజా సెల్ ఫోన్ చోరీ.. నిమిషాల్లోనే..
దైవ దర్శనం కోసం ఆలయంలోకి వెళ్లి పూజలు చేసి తిరిగొచ్చేలోపు ఎమ్మెల్యే బూట్లను కొందరు వ్యక్తులు కొట్టేశారు. ఎమ్మెల్యే బూట్లు కనిపించకపోవడంతో పోలీసులు, అధికారులు ఆగమేఘాలపై తనిఖీలు చేపట్టారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. దాంతో చేసేదిలేక ఎమ్మెల్యే ఛోటేలాల్ వర్మ తన కారు వరకు ఉత్త కాళ్లతోనే నడిచి వెళ్లారు. ఎమ్మెల్యే బూట్లు ఎత్తుకెళ్లిన దొంగలు తీరుపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.