SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » national » Tamil Nadu Woman Appears In Male Get Up From Last 30 Years

Tamil Nadu: కూతురు కోసం 30 ఏళ్లుగా మగాడి వేషధారణలో తల్లి!

  • Written By: Dharani
  • Updated On - Thu - 12 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Tamil Nadu: కూతురు కోసం 30 ఏళ్లుగా మగాడి వేషధారణలో తల్లి!

ఈ ప్రపంచంలో తల్లి ప్రేమను మించిన నిస్వార్థమైన ప్రేమ మరొకటి లేదు. మన నుంచి ఏం ఆశించకుండా.. కేవలం మన సంతోషాన్ని మాత్రమే కోరుకునేది తల్లి. బిడ్డల క్షేమం కోసం నిత్యం తాపత్రయే పడే ఏకైక వ్యక్తి తల్లి. అమ్మ పంచే అనురాగం గురించి ఎంత చెప్పినా తక్కువే. తనకు ఎలాంటి కష్టం వచ్చినా.. తల్లి తట్టుకుంటుంది.. కానీ పిల్లలకు చిన్న ఇబ్బంది వచ్చినా ఊరుకోదు. అసలు ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాలని నిత్యం పరితపిస్తుంది. ఇప్పుడు మీరు చదవబోయే కథనం కూడా అలాంటి మాతృమూర్తికి సంబంధించినదే. పెళ్లైన కొన్ని రోజులకే భర్త చనిపోయాడు.. అప్పటికే కడుపులో అతడి ప్రతిరూపం పెరుగుతుంది. ఇక ఒంటరి మహిళ అంటే.. మన సమాజంలో ఎలా చూస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి మృగాళ్ల చూపుల నుంచి తనను మాత్రమే కాక బిడ్డను కాపాడుకోవడం కోసం ఆ తల్లి అనూహ్య నిర్ణయం తీసుకుంది. గత 30 ఏళ్లుగా మగాళ్ల మాదిరి దుస్తులు ధరిస్తోంది. ప్రస్తుతం ఈ మాతృమూర్తి కథనం ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఆ వివరాలు..

ఇది కూడా చదవండి: Tamil Nadu: ఆ కంపెనీలో బోనస్, ఇంక్రిమెంట్స్ మాత్రమే కాదు.. ఉద్యోగులకు పెళ్లిళ్లు కూడా చేస్తారు!

తమిళనాడుకు చెందిన పెచ్చియామ్మాల్‌కు 20 ఏళ్ల వయసులో వివాహం జరిగింది. ఇప్పటికి ఆమె పెళ్లై 30 సంవత్సరాలు కావోస్తోంది. అయితే దురదృష్టం కొద్ది పెళ్లైన కొద్ది రోజులకు పెచ్చియామ్మాల్‌ భర్త మృతి చెందాడు. అప్పటికే ఆమె గర్భవతి. భర్త చనిపోయిన తర్వాత కడ్డునాయగన్​ పట్టికి మకాం మార్చింది. అక్కడ చిన్నచిన్న పనులు చేసుకుంటూ బతికింది. అయితే ఒంటరి మహిళ కావడం వల్ల ఎన్నో తప్పుడు చూపులు ఆమె వెంటపడి వేధించేవి. ఇంతలో పెచ్చియామ్మాల్‌కి కుమార్తె జన్మించింది. అయితే కూతురిని సంరక్షించడంతో పాటు తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఓ అసాధారణ మార్గాన్ని ఎంచుకుంది పెచ్చియామ్మాల్. మృగాళ్ల వేధింపుల నుంచి తప్పించుకోవడం కోసం.. పురుషుడి వేషధారణలోకి మారింది. పేదరికం వల్ల పనికోసం చాలా ప్రాంతాలకు మారాల్సి వచ్చేది. ఎక్కడికెళ్లినా తనను తాను పురుషుడిలా పరిచయం చేసుకునేది. ఈ క్రమంలోనే స్థానికంగా “అన్నాచ్చి” (పెద్దన్న)గా గుర్తింపు పొందింది. కొన్నాళ్లకు తూతుక్కుడి తిరిగొచ్చి క్రాప్​ హెయిర్​ కట్​, మగాడి దుస్తుల్లో పురుషుడిలానే జీవించసాగింది. టీ, పరోటా షాపుల్లో పనిచేసి ముత్తు మాస్టర్​ గా పేరుగాంచింది. ఇలా 30 ఏళ్ల పాటు అనేక సవాళ్లను ఎదుర్కొంటూ మగరాయుడిలా బతికింది పెచ్చియామ్మాల్.

Join Our Whatsapp Channel

Mother dons man avatar

ఇది కూడా చదవండి: Tamil Nadu: భర్త ఇంట్లో బాత్ రూం లేదని కొత్త పెళ్లికూతురు ఆత్మహత్య!

ఈ సందర్భంగా పెచ్చియామ్మాల్‌ మాట్లాడుతూ..‘‘పెళ్లైన 15 రోజులకే భర్త చనిపోయాడు. ఆ తర్వాత ఆడపిల్ల పుట్టింది. ఆ తర్వాత సొంతూరు నుంచి తూతుక్కుడి వచ్చాను. ఓ ఇల్లు అద్దె తీసుకొని పనిచేసుకునేదాన్ని. ఓ రోజు పని ముగించుకొని వచ్చేటప్పుడు ఓ లారీ అతను నాతో తప్పుగా ప్రవర్తించాడు. అక్కడే ఉన్న మరొక వ్యక్తి సహకారంతో ఆ పరిస్థితి నుంచి బయటపడగలిగాను. అతనే నాకో చొక్కా ఇచ్చి నన్ను ఇంటి దగ్గర దిగబెట్టాడు. మరునాడే 6 గంటలకు పని ముగించుకొని తిరుచానూరుకు వెళ్లి గుండు చేయించుకున్నా. చీర పక్కనపెట్టి ప్యాంటు, షర్టు​, రుద్రాక్ష ధరించా. కొన్నాళ్లకు ఆ డ్రైవర్ ముందు నుంచే వెళ్లినా అతడు గుర్తు పట్టలేదు. అప్పుడే అనిపించింది.. నాకు ఈ దుస్తులే సరైనవని’’ అంటూ చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి: Anand Mahindra: మాట నిలబెట్టుకున్న ఆనంద్‌ మహీంద్రా.. ఇడ్లీ అమ్మకు ఇల్లు!

పెచ్చియామ్మాల్ కూతురు షణ్ముక సుందరి మాట్లాడుతూ… ‘‘పనికి వెళ్లి వచ్చే క్రమంలో ఎదురైన వేధింపులతో అమ్మ పురుషుడిగా వేషధారణ మార్చింది. అమ్మా.. నాన్న అన్నీ తానై నాకు ఏ లోటూ లేకుండా చూసుకుంది. అమ్మ ఇలా చేసినందుకు గర్వంగా ఉంది. అయితే ధ్రువీకరణ పత్రాల్లో పురుషుడిలా ఉండటం వల్ల పింఛను తీసుకోవడంలో అమ్మ ఇబ్బందులు ఎదుర్కుంటోంది. ఆ సమస్య పరిష్కారమై అమ్మకు పింఛను అందితే ఆమెకు ఎంతో సాయంగా ఉంటుంది’’ అని తెలిపింది. మరి బిడ్డతో పాటు తన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడం కోసం పెచ్చియామ్మాల్‌ ఎంచుకున్న మార్గంపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • tamil nadu
  • woman
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

  • ఐఫోన్ కోసం టీచర్‌ను ఈడ్చుకెళ్లిన బైకర్లు.. చివరికి..

    ఐఫోన్ కోసం టీచర్‌ను ఈడ్చుకెళ్లిన బైకర్లు.. చివరికి..

  • అర్ధరాత్రి మహిళపై దాడి చేసిన దొంగ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

    అర్ధరాత్రి మహిళపై దాడి చేసిన దొంగ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

  • ఉద్యోగులకు రూ. 6,200 కోట్ల విరాళం.. కలియుగ కర్ణుడు.. ఇంతకీ ఈయనెవరో తెలుసా?

    ఉద్యోగులకు రూ. 6,200 కోట్ల విరాళం.. కలియుగ కర్ణుడు.. ఇంతకీ ఈయనెవరో తెలుసా?

  • అత్తకు తలకొరివి పెట్టిన కోడలు!

    అత్తకు తలకొరివి పెట్టిన కోడలు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • బ్లింకిట్‌లో యాపిల్ ఐఫోన్ డ్యుయో రికార్డ్.. 5 నిమిషాల్లోనే స్టాక్ సేల్

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

Most viewed

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam