ముఖ్యమంత్రి కాన్వాయ్ ఒక మార్గంలో వస్తుందంటే చాలు ఎక్కడ లేని హడావిడి మొదలైపోతుంది. ఆ రోడ్డంతా ఖాళీగా ఉంటుంది. ఒక పురుగు కూడా ఆ మార్గంలో వెళ్లడానికి వీలుండదు. పైగా కాన్వాయ్ మామూలుగా ఉండదూ ఎర్ర బుగ్గల బండ్లు కూయ్.. కూయ్.. మంటూ ఒక దాని వెంట ఒకటి దూసుకెళ్తాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రోడ్డు మార్గంలో వెళ్తేంటే కనిపించే దృశ్యాలు ఇవి. కానీ తమిళనాడులో మాత్రం ఇందుకు భిన్నంగా ఒక అంబులెన్స్‌కు ఏకంగా సీఎం కాన్మాయ్ మొత్తం పక్కకు తప్పుకుని దారి ఇచ్చింది. భారీ కాన్వాయ్ పక్కకు తప్పుకుని దారి ఇవ్వడంతో ఒకరి ప్రాణాలు నిలిచాయి.
సాధారణంగా అంబులెన్స్ దారి ఇవ్వాలన్న ఇంకితం మరిచి చాలా మంది ప్రవర్తిస్తుంటారు. మన హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే ఈ సమస్య మరీ ఎక్కువగా అలాంటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన కాన్వాయ్‌ను పక్కకు తప్పించి అంబులెన్స్‌కు దారి ఇవ్వడం నిజంగా గ్రేట్. కోయంబెడు నుంచి వెలాచెర్రీకి వెళ్తున్న సీఎం కాన్వాయ్ అంబులెన్స్‌కు దారి ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటికే పలు సంచలన నిర్ణయాలతో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన సీఎం స్టాలిన్‌పై ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తుంది. మరి ముఖ్యమంత్రిగా స్టాలిన్ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: సిటీ బస్సులో ప్రయాణించిన సీఎం
#WATCH | Tamil Nadu Chief Minister MK Stalin’s convoy gives way to ambulance while enroute to Koyambedu from Velachery today. pic.twitter.com/IK03SkhyoK
— ANI (@ANI) November 1, 2021