తల్లిదండ్రులు పిల్లలను ఎంతో నమ్మకంతో విద్యాసంస్థలకు పంపుతారు.. తమ పిల్లలు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకుంటారని అనుకుంటారు. కానీ ఈ మద్య కొంత మంది విద్యార్థులు దారుణాలకు పాల్పపడుతున్నారు. ఆ మద్య తమిళనాడులో కదులుతున్న బస్‌లో పాఠశాల విద్యార్థులు మద్యం సేవిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ పాఠశాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు యూనిఫామ్ ధరించి బస్‌లో బీర్ బాటిల్‌ను ఓపెన్ చేసి తాగుతూ హల్ చల్ చేశారు.. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.
అచ్చం ఇలాంటి ఘటనే మరోకొటి చోటు చేసుకుంది. కాకపోతే మరీ దారుణం ఏంటంటే అమ్మాయిలు క్లాస్ రూమ్‌లోనే మందు పార్టీ చేశారు. ఓ వైపు టీచర్ పాటాలు చెబుతూ.. విద్యార్థినిలు మద్యం సీసాలతో దర్జాగా మందు తాగారు. కాంచీపురం పక్కనే ఉన్న ఏనాతూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ విద్యార్థినిలు డిగ్రీ ఫస్ట్ ఈయర్.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో యాజమాన్యం చర్యలు తీసుకుంది. ఐదుగురు విద్యార్థినిలను సస్పెండ్ చేసింది.
ఈ విషయంపై స్పందించిన విద్యార్థినులు తమ స్నేహితుడు ఈ మద్యం బాటిల్స్ తెచ్చాడని.. తెలిసే తాగినట్లు అమ్మాయిలు ఒప్పుకున్నారు. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉండేందుకు అధికారులు పిల్లలకు అవగాహన కల్పించే పనిలో పడ్డారు. తల్లిదండ్రులు పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. లాంటి సంఘటనలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.