ప్రస్తుతం నడుస్తోంది సోషల్ మీడియా యుగం. మంచైనా, చెడైనా ఇట్టే క్షణాల్లో జరిగిపోవాలంటే.. సోషల్ మీడియా వల్లనే సాధ్యం. ప్రతిభ ఉండి, అవకాశాలు లేని వారికి సోషల్ మీడియా పెద్ద కల్పతరువుగా మారింది. ఎందరో జీవితాలను రాత్రికి రాత్రే మార్చేసింది. ఇక సోషల్ మీడియా ఆదుకున్న జీవితాలు ఎన్నో. తాజాగా మరో సారి తమ మంచి మనసు చాటుకున్నారు నెటిజనులు. సైకిల్ మీద ఫుడ్ డెలివరీ చేస్తున్న జొమాటో డెలివరీ బాయ్‌కు కేవలం 4 గంటల వ్యవధిలోనే 75 వేల రూపాయలు పోగు చేసి.. బైక్ కొనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: జొమాటో డెలివరీ బాయ్‌గా గోల్డ్ మెడల్ సాధించిన అథ్లెట్! కన్నీటి గాథ
రాజస్థాన్‌కు చెందిన ఆదిత్య శర్మ అనే వ్యక్తి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఇక తనకు ఆహారాన్ని అందించడానికి వచ్చిన వ్యక్తి చూసి ఆదిత్య శర్మ ఆశ్చర్యపోయాడు. కారణం.. సదరు డెలివరీ బాయ్ సైకిల్ మీద తనకు ఫుడ్ అందివ్వడానికి వచ్చాడు. వేసవి కారణంగా మనమే ఇంత ఇబ్బంది పడుతుంటే.. ఇక రాజస్థాన్‌లో భానుడి ప్రతాపం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేముంది. 42 డిగ్రీల మండుటెండలో.. అతడు సైకిల్ మీద వచ్చి.. తనకు సమయానికి ఫుడ్ డెలివరీ చేయడం ఆదిత్య శర్మను కదిలించింది. డెలివరీ బాయ్ కి ఏదైనా సాయం చేయాలని భావించి.. అతడి వివరాలు కనుక్కునే ప్రయత్నం చేశాడు.
ఇది కూడా చదవండి: మరో వివాదంలో అల్లు అర్జున్.. నెటిజన్స్ ఫైర్!
డెలివరీ బాయ్ పేరు దుర్గా మీనా(31). డిగ్రీ పూర్తి చేసి ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఉద్యోగం చేస్తుండేవాడు. కానీ కరోనా కారణంగా టీచర్ జాబ్ పోయింది. దాంతో జొమాటోలో ఫుడ్ డెలివరీ బాయ్‌గా చేరాడు. కానీ అతడికి బైక్ లేదు. దాన్ని సమస్యగా భావించలేదు దుర్గా మీనా. తనకు ఉన్న సైకిల్ మీదనే ఫుడ్ డెలివరీ చేస్తాడు. రోజుకు 10-12 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తాడు. స్వయం శక్తిని నమ్ముకుని.. ఉన్న సైకిల్‌తోనే డెలివరీ బాయ్‌గా పని చేసుకుంటున్న దుర్గా మీనా వ్యక్తిత్వం ఆదిత్య శర్మకు బాగా నచ్చిందది. ఎలాగైనా అతడికి బైక్ కొనివ్వాలని నిర్ణయం తీసుకున్నాడు.
Today my order got delivered to me on time and to my surprise, this time the delivery boy was on a bicycle. today my city temperature is around 42 °C in this scorching heat of Rajasthan he delivered my order on time
I asked for some information about him so 1/ pic.twitter.com/wZjHdIzI8z
— Aditya Sharma (@Adityaaa_Sharma) April 11, 2022
ఇది కూడా చదవండి: Zomato ద్వారా ఇక నుంచి ఫుడ్ డెలివరీ ఒక్కటే కాదు..
ఈ క్రమంలో దుర్గామీనా ఫోటో తీసి.. అతడి పరిస్థితిని వివరిస్తూ.. సాయం చేయాల్సిందిగా నెటిజనులను కోరాడు. కేవలం 1 రూపాయి ఇవ్వాల్సిందిగా అభ్యర్థించి.. తన అకౌంట్ వివరాలు పోస్ట్ చేశాడు. ఇక ఆదిత్య శర్మ పోస్ట్‌కు విపరీతమైన స్పందన వచ్చింది. కేవలం 4 గంటల వ్యవధిలోనే.. 75 వేల రూపాయలు సమకూరాయి. ఆ డబ్బులతో బైక్ కొని దుర్గా మీనాకు అప్పగించాడు. బైక్‌కు సంబంధించి ఫోటోలను కూడా షేర్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆదిత్య శర్మ మంచి మనసు, జొమాటో డెలివరీ బాయ్ దుర్గా మీనా వ్యక్తిత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
He is on his way ✅to reach showroom pic.twitter.com/JN1OzPr3wO
— Aditya Sharma (@Adityaaa_Sharma) April 12, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.