సాధారణంగా ప్రతి కంపెనీ తమ ఉత్పత్తులను మార్కెట్ లో ప్రమోట్ చేయడం కోసం వివిధ రకాల యాడ్స్ ను రూపొందిస్తారు. వాటి ద్వారా వినియోదారులను ఆకర్షిస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో వస్తున్న యాడ్స్ వివాదస్పదంగా ఉంటున్నాయి. యువతలో చెడు ఆలోచనలు కలిగించేలా యాడ్స్ ఉంటున్నాయి. తాజాగా క్రియేటివిటీ పేరిట ఓ బాడీ స్ప్రే కంపెనీ రూపొందించిన యాడ్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
భారత్ కు చెందిన ప్రముఖ పర్ఫ్యూమ్, స్ప్రే తయారీదారు కంపెనీ లేయర్స్ షాట్ అనే కొత్త పర్ఫ్యూమ్ ను మార్కెట్ లోకి తెచ్చింది. దీనికోసం తాజాగా రెండు యాడ్స్ ను రూపొందించింది. ఈ రెండూ కూడా డబుల్ మీనింగ్ ఉద్దేశ్యంతో.. యువతులను అగౌరవపరిచేలా, యువతలో రేప్ కల్చర్ ను పెంపొందిచేలా ఉందని చాలామంది అభిప్రాయాపడుతున్నారు. ఓ యాడ్ లో షాపింగ్ మాల్ కు వెళ్లిన నలుగురు కుర్రరాళ్లు ఒకే పర్ఫ్యూమ్ ఉండటం చూసి.. మేం నలుగురం ఉన్నాం కానీ అక్కడ ఒకటే ఉంది ‘షాట్’ ఎవరు తీసుకుంటారు? అని చర్చించుకుంటారు. అది విన్న యువతి షాకై.. వారివైపు కోపంగా చూస్తుంది. కానీ వారు షాట్ స్ప్రే గురించి మాట్లాడుకుంటున్నారని తెలిసి నవ్వుతుంది.
ఇదీ చదవండి: ఏపీలో దారుణం.. మహిళను స్తంభానికి కట్టేసి హింసించారు.. కారణం ఏంటంటే?..
మరొక యాడ్ లో ఓ జంట గదిలో ఉండగా నలుగురు యువకులు వచ్చి “షాట్” కోసం చేసిన కామెంట్స్ యువతి భయపడేలా చేశాయి. చివరికి షాట్ స్ప్రే కోసం అని తెలిసి సదరు యువతి ఊపిరిపీల్చుకుంటుంది. ఈ వాణిజ్య ప్రకటనలు చిన్నవిషయం మాత్రమే కాదు, చాలా మంది మహిళలు రోజూ ఎదుర్కొనే భయాన్ని కూడా తమ స్వలాభం కోసం వాడుకుంటోందన్నది పలువురి వాదన.
Can’t find the ad online but here it is, apparently being played during the match. I didn’t see it till @hitchwriter showed it to me
Who are the people making these ads really? pic.twitter.com/zhXEaMqR3Q
— Permanently Exhausted Pigeon (@monikamanchanda) June 3, 2022
ఇంగ్లండ్ న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఈ యాడ్స్‌ను ప్రసారం చేసింది. అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ASCI).. సోషల్ మీడియాలో ఈ రెండు షాట్ యాడ్స్ దుమారంపై స్పందించింది. ఆ యాడ్స్‌ను తొలగించడంతో పాటు దర్యాప్తునకు ఆదేశించినట్లు ట్విటర్లో తెలిపింది. ఈ యాడ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
How does this kind of ads get approved, sick and outright disgusting. Is @layerr_shot full of perverts? Second ad with such disgusting content from Shot.@monikamanchanda pic.twitter.com/hMEaJZcdmR
— Rishita💝 (@RishitaPrusty_) June 3, 2022