పవిత్ర కాశీ విశ్వనాథ మందిరం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. నిత్యం వివాదాలు రాజుకుంటున్న క్రమంలో సోమవారం మసీదు ప్రాగణంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. కోర్టు ఆదేశాల మేరకు ఇక్కడ సర్వే చేస్తున్న అధికారులకు మసీదు ప్రాంగణంలో శివలింగం కనిపించింది. దీంతో ఆ పరిసరాలను వెంటనే సీల్ చేయాలని స్థానిక కోర్టు ఆదేశాలు జారీచేసింది. ‘‘శివలింగం కనిపించిన ప్రాంగణాన్ని వెంటనే సీల్ చేయాలని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీచేశారు. ఆ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లడానికి వీల్లేదు’’ అని ఆదేశాల్లో పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలు వాస్తవమైనవేనని బనారస్ జిల్లా మేజిస్ట్రేట్ కౌశల్ రాజ్ శర్మ ధ్రువీకరించారు. అసలు ఇంతకు మసీదు ప్రాంగణంలో సర్వే ఎందుకు నిర్వహిస్తున్నారు… దీనిపై ముస్లింలు అభ్యంతరం వ్యక్తం చేయడానికి గల కారణాలు ఏంటి అనే పూర్తి వివరాలు..
జ్ఞాన్‌వాపి మసీదు చరిత్ర ఏంటంటే..
జ్ఞాన్‌వాపి సంస్కృత పదం. అర్థం జ్ఞానపు బావి. మరి ఈ పేరుతో మసీదు ఏమిటి.. పైగా ఆ మసీదు గోడల మీద హిందూ ఆలయ ఆనవాళ్లు కనిస్తాయి అంటే చరిత్రలోకి వెళ్లాల్సిందే. ఔరంగజేబు పాలన సమయంలో పలు హిందూ దేవాలయాల మీద దాడులు జరిగాయి. 1669లో మొఘలు చక్రవర్తి ఔరంగజేబ్ కాశీ విశ్వనాథుని అసలు ఆలయాన్ని కూల్చి అక్కడ మసీదు కట్టించాడు. దీన్నే జ్ఞాన్‌వాపి మసీదు అంటున్నారు. ఆ దాడుల్లో విశ్వనాథుని ఆలయ అర్చకులు అసలు జ్యోతిర్లింగాన్ని ఇక్కడి జ్ఞానపుబావిలో దాచారని చరిత్ర చెబుతోంది. ఇక మనదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత హిందువులు పరమ పవిత్రంగా భావించే ఈ గొప్ప ఆధ్మాత్మిక క్షేత్రానికి జరిగిన అవమానాన్ని సరిదిద్దాలని శతాబ్దాలుగా పోరాటాం సాగిస్తూనే ఉన్నారు. దీన్ని తమకు తిరిగి అప్పగించాలని శతాబ్దాలుగా హిందువులు కోరుతూనే ఉన్నారు. అయితే తాజాగా మరోసారి ఈ వివాదం తెరమీదకు రావడంతో.. ప్రస్తుతం దేశ ప్రజల దృష్టి దీనిపై నిమగ్నమైంది.
ఇది కూడా చదవండి: అతనికి వచ్చిన కలే నిజమయ్యింది.. చెప్పిన చోటే శివలింగం ప్రత్యక్షం!
కోర్టు ఆదేశాలతో సర్వే..ప్రస్తుతం జ్ఞాన్‌వాపి మసీదు ఉన్న స్థలంలోని పురాతన ఆలయాన్ని పునరుద్ధరించడానికి వారణాసి జిల్లా కోర్టులో 1991లో తొలిసారి దావా దాఖలైంది. ఈ మసీదు ప్రాంగణమంతా ఆలయానికే చెందుతుందని న్యాయవాది విజయ్ శంకర్ రస్తోగి వారణాసి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రెండు వేల ఏళ్లుగా అక్కడ ఆలయం ఆనవాళ్లు ఉన్నాయని, ఔరంగజేబ్ ఆలయాన్ని ధ్వంసం చేసి, మసీదుగా మార్చారని, వివాదాస్పద మసీదు వక్ఫ్ ఆస్తి కాదని వాదించారు. 2011 ఏప్రిల్‌లో ఈ పిటిషన్‌పై స్పందించిన న్యాయస్థానం ప్రస్తుతం కాశీ విశ్వనాథ్ ఆలయంతో పాటు జ్ఞాన్‌వాపి మసీదు ఉన్న స్థలాన్ని సర్వే చేయడానికి భారత పురావస్తు శాఖకు అనుమతి ఇచ్చింది. సర్వేకు అయ్యే ఖర్చును భరించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ముస్లిం సమాజానికి చెందిన ఇద్దరు సభ్యులతో కూడిన ఐదుగురు సభ్యుల కమిటీతో ఈ సర్వే చేయించాలని కోర్టు సూచించింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ (జ్ఞాన్‌వాపి) దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు ఈ ఏడాది ఏప్రిల్ 21న తోసిపుచ్చింది.
ఇది కూడా చదవండి: శ్రీకాకుళంలో అద్భుతం! కళ్ళు తెరిచి చూస్తున్న శివలింగం!
ఇక ఇదే విషయంపై 2021, ఆగస్టులో ఐదుగురు మహిళలు వారణాసి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జ్ఞాన్‌వాపి మసీదు పరిసరాల్లో మా శృంగార గౌరీ, వినాయక, హనుమాన్ దేవాలయాలకు వెళ్లేందుకు అనుమతించాలని వీరు కోరారు. ఆ దేవాలయాల్లోని విగ్రహాలను జ్ఞాన్‌వాపి మసీదు కమిటీ ధ్వంసం చేయకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పరిరక్షించేలా ఆదేశాలు జారీచేయాలని ఆ ఐదుగురు మహిళలు పిటిషన్‌లో కోరారు. వారి అభ్యర్థనను మన్నించని కోర్టు మసీదు ప్రాంగణంలో సర్వే నిర్వహించాలని ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలతో సర్వే నిర్వహించడానికి వచ్చిన కోర్టు కమిషనర్ అజయ్ కుమార్ మిశ్ర బృందాన్ని ముస్లింలు అడ్డుకున్నారు. ఇదే అంశంపై కోర్టు మరోసారి స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో శనివారం సర్వే ప్రారంభించి మే 17 నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది. శనివారం ప్రారంభమైన సర్వే సోమవారం ముగిసింది. ఈ క్రమంలో మసీదు ఆవరణలో శివలింగం కనిపించింది. దాంతో అధికారులు ఆ ప్రాంగణాన్ని సీల్ చేశారు. మరి తుది తీర్పు ఏవిధంగా రానుందో చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: 3 రోజులుగా ఆకాశం నుంచి పడుతున్న వింత వస్తువులు.. భయాందోళనలో జనాలు!