దేశ రక్షణ కోసం సైన్యంలో చేరతానని కుమారుడు చెప్పినప్పుడు.. ఆ తల్లి చాలా సంతోషించింది. తన బిడ్డ కేవలం తన స్వార్థం కోసం మాత్రమే కాక.. భరతమాత రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టడానికి సిద్ధపడ్డాడని పొంగిపోయింది. కానీ ఆ తల్లి త్యాగం వృథా అయ్యింది. దేశ రక్షణ కోసం ఆర్మీలో చేరిన కుమారుడు.. పాకిస్తాన్ సేనలకు చిక్కి.. ఆ దేశ జైళ్లో మగ్గుతున్నాడు. ఏడాది కాదు, రెండేళ్లు కాదు.. పాతికేళ్లుగా పాక్ జైల్లో మగ్గుతున్న కుమారుడిని విడిపించాలని కోరుతూ.. ఆ తల్లి 81 ఏళ్ల వయసులో కూడా న్యాయపోరాటం చేస్తోంది. కన్నుమూసేలోపు కడుపారా కన్నబిడ్డను ఒకసారి చూస్తే చాలని భావిస్తోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడవంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ మాతృమూర్తి దాఖలు చేసిన పిటిషన్‌ని విచారించేందుకు సుప్రీంకోర్టు పప్రధాన న్యాయమూర్తి అంగీకరించారు. ఆ వివరాలు..
కుమారుడు సంజీత్ భట్టాచార్జీని పాక్ జైల్ నుంచి విడుదల చేయించేందుకు గాను ఆయన తల్లి 81 ఏళ్ల కమలా భట్టాచార్జీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిలో ఉన్నదాని ప్రకారం.. 1997, ఏప్రిల్ 20న సంజీత్. భారత్-పాక్ ఇరుదేశాల ఉమ్మడి సరిహద్దు గుజరాత్‌లోని కచ్ వద్ద పెట్రోలింగ్ విధులు నిర్వహించడం కోసం వెళ్లాడు. అతడితో పాటు మరో 15 మంది కూడా ఉన్నారు. విధులు ముగిసిన తర్వాత మిగతా 15 మంది తిరిగి వచ్చారు కానీ సంజీత్ రాలేదు. పాకిస్తాన్ ఆర్మీ సంజీత్‌ని కిడ్నాప్ చేసినట్లు అధికారులు అతడి కుటుంబ సభ్యులకు తెలిపారు. ఇది జరిగి ఇప్పటికి 24 పూర్తయిందని.. ఇన్నేళ్లలో కనీసం ఒక్కసారి కూడా తమ కుమారుడితో మాట్లాడే అవకాశం లభించలేదని అతడి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.
ఇది కూడా చదవండి: భర్త ఆస్తి పై భార్యకి పూర్తి హక్కు లేదు: సుప్రీం సంచలన తీర్పుఅంతేకాక సంజీత్ పేరును బతికున్న మిస్సింగ్ యుద్ధ ఖైదీల జాబితాలో చేర్చినట్లు 2010లో సైనికాధికారుల నుంచి వారికి ఓ లేఖ అందింది. కుమారుడి కోసం ఎదురు చూసి.. చూసి అతడి తండ్రి 2020లోనే కన్నుమూశాడు. తాను కన్నుమూసేలోపు ఒక్కసారైనా సంజీత్‌ను చూడాలని ఆ తల్లి ఆరాటపడుతోంది. 1997లో అదృశ్యమైన తన కుమారుడు ఆర్మీ కెప్టెన్ సంజీత్ భట్టాచార్జీని తిరిగి స్వదేశానికి రప్పించేందుకు దౌత్య మార్గాల ద్వారా కేంద్రం చర్యలు తీసుకునేలా మార్గదర్శకాలు జారీ చేయాలంటూ ఆయన తల్లి కమలా భట్టాచార్జీ (81) న్యాయపోరాటం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానిక కోటా.. రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ
ఈ అంశంపై పలుమార్లు ప్రభుత్వాలకు లేఖలు రాసినా ఎటువంటి ఫలితం లేకపోయింది. చివరకు కన్నమూసేలోపైనా కుమారుడిని చూడాలని భావించిన కమలా భట్టాచార్జీ.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో కోర్టు ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు ఎట్టకేలకు అంగీకరించింది. ఆమె వాదనలు వినేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం ఆమోదం తెలిపింది. ఓ సైనికుడి కుటుంబానికి న్యాయం చేయాల్సిన ఈ పిటిషన్‌ను సత్వరం విచారించాలని వారి తరఫున న్యాయవాది సౌరభ్ మిశ్రా అభ్యర్థించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హిమా కోహ్లిల ధర్మాసనం ఏప్రిల్ మొదటివారంలో ఈ పిటిషను విచారిస్తామని పేర్కొంది. కమలా భట్టాచార్జీ పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని గతేడాది మార్చి 5నే కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.