ప్రపంచ వ్యాప్తంగా భారత ప్రధాని మోదీకి ఉన్న చరిష్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ దేశం వెళ్లిన అక్కడ ఆయన ఘన స్వాగతం లభిస్తుంది. పర్యటనల్లో భాగంగా మోదీ ఆయా దేశాల స్థానికులతో మమేకమవుతుంటారు. విదేశాలకు వెళ్లిన సందార్భాల్లో అక్కడి భారతీయులతో సమావేశం అవుతారు. చిన్నారులతో సైతం మోదీ ముచ్చటిస్తూ..వారిలో కలసిపోతారు. చిన్నారులు మోదీకి బహుమతులు ఇస్తుంటారు. తాజాగా జపాన్ పర్యటనకు వెళ్లిన మోదీకి అక్కడి బాలుడు హిందీలో మాట్లాడి ఆశ్చర్యపరిచాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మంగళవారం జరగబోయే క్వాడ్ సమావేశాల్లో హజరయ్యేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం జపాన్ చేరుకున్నారు. ఇదిలా ఉండగా సోమవారం ఉదయం టోక్యో చేరుకున్న మోదీకి ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు. “మోదీ మోదీ”,”వందేమాతరం”,”భారత్ మాతా కీ జై” అని నినాదాలు చేస్తూ.. త్రివర్ణ పతాకాన్ని ఊపుతూ ప్రధాని మోదీకి స్వాగతం చెప్పారు. ఈ సందర్బంగా మోదీ ఆటోగ్రాఫ్ కోసం ఓ జపాన్ బాలుడు వేచి ఉన్నాడు. మోదీ తన దగ్గరకు రాగానే బాలుడు హిందీలో మాట్లాడాడు. దీంతో ప్రధాని మోదీ ఆశ్చర్యపోయారు.
“జపాన్‌కు స్వాగతం.. దయచేసి మీ ఆటోగ్రాఫ్ నాకు ఇవ్వండి”, అని రిత్సుకీ కొబయాషి.. ప్రధాని మోదీని హిందీలో అడిగాడు. ఈ క్రమంలో మోదీ.. “వాహ్.. మీరు హిందీ ఎక్కడ నుండి నేర్చుకున్నారు? బాగా మాట్లాడారు” అని ప్రశంసించారు. అనంతరం అక్కడున్న జపాన్ విద్యార్థులకు మోదీ ఆటోగ్రాఫ్ ఇచ్చారు. మరి.. మోదీకి జపాన్ బాలుడికి మధ్య జరిగిన సంభాషణపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#WATCH | “Waah! Where did you learn Hindi from?… You know it pretty well?,” PM Modi to Japanese kids who were awaiting his autograph with Indian kids on his arrival at a hotel in Tokyo, Japan pic.twitter.com/xbNRlSUjik
— ANI (@ANI) May 22, 2022