చిన్న పిల్లలు ముద్దు ముద్దు మాటలు, పాటలు పాడితే ఎంతో అందంగా, ఆనందంగా ఉంటుంది. ఓ చిన్నారి గొంతుకు ప్రధాని నరేంద్ర మోడీ ఫిదా అయ్యారు. గుజరాత్లోని జిల్లా పంచాయతీ సభ్యులతో ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు సమావేశమయ్యారు. గ్రామాల్లో జీవన ప్రమాణాలు, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే మార్గాలపై వారి అభిప్రాయాలను ఆయన అభినందించారు. ఈ సమావేశం అనంతరం ఓ ఫ్యామిలీ ప్రధాని మోదీని కలిశారు.
ఈ సందర్భంగా ఓ చిన్నారి తన గానంతో ప్రధారి మోదీని ఆశ్చర్యపరిచింది. ఆ చిన్నారి తన అందమైన గొంతుతో ‘అయిగిరి నందిని’ స్తోత్రాన్ని గుక్కతిప్పుకోకుండా ఒక్క నిమిషం పాటు చదివింది. ముద్దు ముద్దుగా ఆ చిన్నారి స్తోత్రాన్ని చదువుతుంటే ఎంతో శ్రద్దగా విన్నారు మోదీ. పాప ప్రతిభకు ఎంతగానో ఆశ్చర్యపోయారు. తర్వాత వాహ్ అంటూ చిన్నారిని అభినందించి, ఆశీర్వదించారు.