సామాన్య ప్రజల పట్ల కొన్ని బ్యాంకులు, మరికొన్ని రుణా సంస్థలు దారుణంగా ప్రవర్తిస్తుంటాయి. తాము ఇచ్చిన లోన్ రికవరీ కోసం సామాన్య ప్రజలకు నరకం చూపిస్తుంటాయి. వేల కోట్లు రుణాలు ఎగ్గొట్టి దేశం వదలి పారిపోయిన వాళ్లను ఏమి చేయాలని సంస్థలు.. చిన్న చిన్న రుణాలు తీసుకునే సామాన్య ప్రజల విషయంలో దారుణంగా ప్రవర్తిస్తుంటాయి. అలానే తాజాగా రుణం తీసుకున్న ఓ మధ్యతరగతి కుటుంబ విషయంలో ఓ ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ దారుణంగా ప్రవర్తించింది. కరోనాతో తల్లిదండ్రులు చనిపోతే 17 ఏళ్ల మైనర్ బాలికకు లోన్ రికవరీ నోటీసులు పంపింది. విషయం తెలుసుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సీరియస్ అయ్యారు. ఈ విషయాన్ని ఒకసారి పరిశీలించాలంటూ సంబంధిత సంస్థను ఆదేశించారు.
మధ్యప్రదేశ్ చెందిన వనీషా తల్లిదండ్రులు గతేడాది మే నెలలో కరోనాతో మరణించారు. వనీషాకు 11 ఏళ్ల తమ్ముడు వివాన్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం వనీషా వయసు 17 ఏళ్లు మాత్రమే. అయితే తన తండ్రి చనిపోయిన కొద్దికాలానికే ఆమెకు గృహంకు సంబంధించిన రుణం రికవరీ నోటీసులు అందాయి. వనీషా పాఠక్ తండ్రి జితేంద్ర పాఠక్ ఓ ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థలో ఏజెంట్‌గా పనిచేసేవాడు. ఆ సమయంలో తన ఆఫీసు నుంచి ఇంటి కోసం కొంత రుణం తీసుకున్నాడు. కరోనాతో తండ్రి మరణించిన తర్వాత.. ఈ ఇన్సూరెన్స్ కంపెనీ ఆయనకు రావాల్సిన అన్ని సేవింగ్స్‌ను, నెలవారీ కమిషన్లను బ్లాక్ చేసింది. అంతేకాక వినిషా తండ్రి పేరుతో ఉన్న హోమ్ లోన్ విషయంలో లోన్ రికవరీ నోటీసులు పంపింది.
ఇదీ చదవండి: పోలీసుల నుండి తప్పించుకోబోయి ప్రాణాలు పోగొట్టుకున్నాడు!
రుణాలన్ని తిరిగి చెల్లించాలని లేదంటే.. చట్టపరమైన చర్యలకు ఎదుర్కొవాల్సి ఉంటుందంటూ హెచ్చరించింది. లోన్ తీర్చేందుకు తనకు సమయం ఇవ్వాలని వనీషా ఎన్నిసార్లు కోరినా కూడా సదరు ఇన్సూరెన్స్ అధికారుల నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ప్రస్తుతం తాను, తన తమ్ముడు మేనమామ అశోక్ శర్మ ఇంట్లో ఉంటున్నామని, లోన్ కట్టేందుకు తమకు కాస్త సమయం ఇవ్వాలని వనీషా కోరింది. తన తల్లిదండ్రులు ఇద్దరూ మే 2021లో కరోనాతో మరణించారని, తామిద్దరం మైనర్లమని ఆ సంస్థ కి రాసిన లేఖలో పేర్కొంది. ప్రస్తుతం తమ ఆర్థిక పరిస్థితి బాగోలేదని వినిషా తెలిపింది. అయితే ఆ ఇన్సూరెన్స్ సంస్థ నుంచి వినిషాకి ఎలాంటి సమాధానం రాలేదు.
ఇదీ చదవండి: కోడలిగా ఆ గ్రామానికి వచ్చింది..! ఆ ఊరికే దేవత అయ్యింది!
మరోవైపు వనీషా అప్లికేషన్‌ను ఆ సంస్థ ప్రధాన కార్యాలయానికి పంపామని లోకల్ అధికారులు చెబుతున్నారు. ఇంకా ప్రధాన కార్యాలయం నుంచి సమాధానం అందలేదని లోకల్ అథారిటీలు చెబుతున్నారు. ఈక్రమంలో సదరు ఇన్సూరెన్స్ సంస్థ అధికారులపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సీరియస్ అయ్యారు. వినిషా కి సంబంధించిన సమస్యను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
@DFS_India @LICIndiaForever
Please look into this. Also brief on the current status.Orphaned Topper Faces Loan Recovery Notices https://t.co/MNnC7FG6uM via @economictimes
— Nirmala Sitharaman (@nsitharaman) June 5, 2022