Kamandala Tirtha : భారత దేశంలోని నూటికి 90 శాతం దేవాలయాలు అద్భుతాలకు నెలవులు. సైన్స్ సైతం గుట్టు విప్పలేని విషయాలు, రహస్యాలు అక్కడ దాగి ఉన్నాయి. అందుకు ఓ ప్రత్యక్ష ఉదాహరణ కర్ణాటక రాష్ట్రం, చిక్‌మంగళూరు జిల్లాలోని కేశవే గ్రామంలోని శ్రీ కమండల గణపతి దేవాలయం. ఈ గుడికి దాదాపు 1000 ఏళ్ల చరిత్ర ఉంది. స్వయంగా పార్వతీ దేవే ఈ వినాయకుడిని ప్రతిష్టించిందని చరిత్ర చెబుతోంది. ఇక్కడో అంతుచిక్కని మహా అద్భుతం ఉంది. ఈ గుడిలో వినాయకుడి విగ్రహం ముందు ఓ రంధ్రం ఉంది. ఆ రంధ్రం నుంచి ఏక ధాటిగా నీళ్లు ఉబికి వస్తూనే ఉంటాయి. ఇలా సంవత్సరంలోని అన్ని రోజులు జరగుతూనే ఉంటుంది.
ఈ నీళ్లు బ్రహ్మ దేవుడి కమండలం నుంచి వస్తున్నాయని అంటూ ఉంటారు. బ్రహ్మి నది కూడా ఇక్కడ పుట్టిందనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడ ఉన్న నీళ్లలో స్నానం చేస్తే అన్ని దోషాలు పోతాయని, ముఖ్యంగా శని దోషం నుంచి విముక్తి లభిస్తుందని ప్రజల నమ్మకం. ‘‘ఇల్లు అమావాస్య’’ సమయంలో స్వయంగా పార్వతి దేవీ ఇక్కడికి వచ్చి పూజలు చేస్తుందని నమ్ముతుంటారు. అందుకే ఆ రోజు ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. ప్రస్తుతం కమండల గణపతి ముందున్న నీటి బుగ్గకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కమండల గణపతి దేవాలయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
🙏 Jai Shri Ganesh 🙏
The constantly flowing water in front of God Ganesha’s murti is the origin of Brāhmi River.
This holy water is believed to be poured by God Brahma from his Kamandala.#Kamandala Ganapati Temple
Koppa, Chikmagalur Dist. Karnataka pic.twitter.com/cShJR0hak6— Dr. Mamata R. Singh (@mamatarsingh) March 30, 2022
ఇవి కూడా చదవండి : అప్పుడు ‘కచ్చాబాదం’.. ఇప్పుడు ‘జింగిల్’ వీడియో వైరల్