దేశంలో గత కొంత కాలంగా పలు రాష్ట్రాల్లో ఆర్థిక నష్టాలు భారీగానే జరిగాయి. తిరిగి ఆర్థికంగా పుంజుకోవడానికి కొన్ని వినూత్న ప్రయోగాలు చేస్తున్నాయి రాష్ట్రాలు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం మందుబాబులకు శుభవార్త చెప్పింది. ఇక నుంచి కిరాణా పచేరీ కొనుగోలు చేస్తున్నట్టుగా మందు కొనేయవచ్చు. ఈ మేరకు కొత్త మద్యం పాలసీను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ఇక నుంచి మహారాష్ట్రలో వైన్ బాటిల్స్..పెద్ద పెద్ద కిరాణా షాపుల్లోనూ, డిపార్ట్‌మెంటల్ షాపుల్లోనూ విక్రయించవచ్చు.
ఇది చదవండి : పబ్ లో అమ్మాయిలతో వర్మ రచ్చ రచ్చ- వీడియో వైరల్
ఇప్పటి వరకూ చాలా రాష్ట్రాల్లో ఉన్నట్టే కేవలం లిక్కర్ షాపుల్లో మాత్రమే మద్యం క్రయ విక్రయాలు జరుగుతాయి. ఇక నుంచి మహారాష్ట్ర ప్రభుత్వ కొత్త లిక్కర్ పాలసీతోకిరాణా షాపుల్లో కూడా వైన్ బాటిల్స్ లభ్యమవుతాయి. ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మహారాష్ట్ర షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం కింద రిజిస్టర్ చేసుకున్న 1,000 చదరపు అడుగులు లేదంటే, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన సూపర్ మార్కెట్‌లు, దుకాణాలు షెల్ఫ్-ఇన్-షాప్ పద్ధతిని అవలంబించవచ్చు. కాకపోతే ప్రార్థనా మందిరాలు, విద్యాసంస్థలకు సమీపంలోని సూపర్ మార్కెట్లకు మాత్రం ఇందుకు అనుమతి లేదు. మద్య నిషేధం అమల్లో ఉన్న జిల్లాల్లోనూ దీనికి అనుమతి లేదు.
ఇది చదవండి : అంరిక్షంలో వింత వస్తువు.. 18 నిమిషాలకోసారి భూమిపైకి సిగ్నల్
చిన్న, మధ్య తరహా వైనరీస్‌ను ప్రోత్సహించే క్రమంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు. పండ్ల ఆధారిత వైన్ ఉత్పత్తులకు ప్రేరణ లభించాలనే ఉద్దేశ్యంలో పదేళ్లపాటు జీఎస్టీ రద్దు చేసినట్టు మంత్రి నవాబ్ మాలిక్ చెప్పారు. ఇక నుంచి మందుబాబులు నేరుగా కిరాణా సామాను కొన్నట్టే..మందు కొనుగోలు చేయవచ్చు లేదా కిరాణా సామానుతో పాటే మద్యం బాటిల్స్‌కు ఆర్డర్ చేసేయవచ్చు. వైన్ అమ్మకాల కోసం లైసెన్స్ ఫీజు కింద సూపర్ మార్కెట్లు రూ. 5 వేలు చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు సూపర్ మార్కెట్లు, వాక్ ఇన్ స్టోర్లలో వైన్ విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని ప్రోత్సహిస్తోందని దుమ్మెత్తి పోసింది. మహారాష్ట్రను ‘మద్య రాష్ట్రం’గా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకుంటామన్నారు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.