అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఊహించడం కష్టం. సరిగ్గా ఇదే పరిస్థితి ఎదురయ్యింది ఓ రైతుకు. భూమి తల్లిని నమ్ముకున్న రైతు నమ్మకం వమ్ము కాలేదు. ఆ నేలే.. అతడి ఇంట సిరులు కురిపించింది. జీవితకాలం కష్టపడి వ్యవసాయం చేసినా సంపాదించలేనంత మొత్తాన్ని ఒక్కరాత్రే కళ్ల చూశాడు. ఆ వివరాలు… మధ్యప్రదేశ్‌కు చెందిన రైతు ప్రతాప్ సింగ్ యాదవ్ వ్యవసాయం చేస్తూ.. జీవనం సాగిస్తుండేవాడు. కానీ అందులో నష్టాలు రావడంతో.. మూడు నెలల క్రితం పన్నా ప్రాంతంలోని ఓ వజ్రాల గనిలో కార్మికుడిగా చేరాడు. ఈ క్రమంలో అతడికి ఓ వజ్రం దొరికింది. ఈ విషయాన్ని వజ్రాల అధికారి రవి పటేల్ బుధవారం వెల్లడించారు. ఆ వజ్రాన్ని త్వరలో జరగనున్న వేలంలో అమ్మకానికి ఉంచి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ధరను నిర్ణయించనున్నారు.
ఇది కూడా చదవండి: Yogi Adityanath:ఐదేళ్ల తర్వాత తల్లి ఆశీర్వాదం తీసుకున్న యూపీ సీఎం యోగి!
Panna Earth made poor farmer rich Diamond weighing 11.88 carats found in Patti diamond mine of Krishna Kalyanpur After the news of getting the diamond spread, there was a festive atmosphere at the farmer’s house, Lucky Farmer Pratap Singh Yadav @SanjayMishraIAS @Bpsingh_bjp pic.twitter.com/XC7adREYdE
— Amit Singh Rathaur (@amitsrathaur) May 4, 2022
వ్యాపారుల అంచనాల ప్రకారం ప్రతాప్ సింగ్‌కు దొరికిన వజ్రం పబ్లిక్ సేల్‌లో రూ. 50 లక్షల కంటే ఎక్కువ పొందవచ్చు అంటున్నారు. ముడి వజ్రాన్ని వేలం వేసి ప్రభుత్వ రాయల్టీ, పన్నులను మినహాయించి వచ్చిన డబ్బును రైతుకు అందజేస్తామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. “నేను కొద్దిగా వ్యవసాయ భూమి ఉన్న పేదవాడిని. అదనంగా కూలీగా పని చేస్తున్నాను. గత మూడు నెలలుగా ఈ గనిలో కష్టపడి పనిచేస్తున్నాను. ఈ వజ్రాన్ని డైమండ్ వర్క్‌ప్లేస్‌లో డిపాజిట్ చేశాను. వేలం ద్వారా వచ్చిన డబ్బుతో వ్యాపారాన్ని ప్రారంభించి.. పిల్లల చదువుల కోసం వినియోగిస్తాను” అని తెలిపాడు.
ఇది కూడా చదవండి: AAP MLA: సీన్ మార్చేసిన ఎమ్మెల్యే.. ఇప్పుడు ఏకంగా కాస్ట్లీ కారులో..
కాగా పన్నా జిల్లాలో 12 లక్షల క్యారెట్ల వజ్రాల నిల్వలు ఉన్నాయని అంచనా. ఇక గత ఏడాది ఏపీలో ఓ రైతుకు ఇలాంటి అదృష్టమే వరించింది. కర్నూలు జిల్లాకు చెందిన ఓ రైతు కూలీకి పొలంలో పని చేసుకుంటుండగా వజ్రం దొరికింది. దాని విలువ కొన్ని కోట్లు పలికింది. రైతు సుడి తిప్పిన ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Assistant Loco Pilot: రైలు ఆపి.. మద్యం కోసం వెళ్లిన డ్రైవర్! మండిపడుతున్న నెటిజన్లు!