ఇటీవల అడవుల్లో ఉండాల్సిన వన్యమృగాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఎక్కువగా చిరుత పులులు, ఎలుగు బంట్లు ప్రజలపై దాడులు చేసి గాయపరుస్తున్నాయి. జనావాసాల్లో ఉండే సాధుజంతువులపైన దాడులు చేస్తున్నాయి. కొండ ప్రాంతాల్లో, అటవీ ప్రాంత సమీపంలో నివసించే వారికి, వెన్నులో ఒణుకు పుట్టిస్తున్నాయి. పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా పెడుతూనే ఉన్నారు.
ప్రజలకు ధైర్యం చెబుతూనే ఉన్నారు. కానీ.. కృర మృగాలు వస్తూనే ఉన్నాయి.. దాడులు చేస్తూనే ఉన్నాయి. ఆదివారం రాత్రి నాసిక్ జిల్లా దారుణం జరిగింది. ఇంట్లో ఉన్న కుక్కను చిరుత ఎత్తుకెళ్లడం అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ఇంటి సభ్యులు భయంతో వణికిపోయారు. ఇది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: కొడుకును అంగన్వాడిలో చేర్పించిన కలెక్టర్… హ్యట్సాఫ్ అంటున్న నెటిజన్లు!
ఒక ఇంటి గోడ వద్ద కుక్క పడుకొని ఉంది.. అక్కడ తచ్చాడుతున్న చిరుత పులిని చూసి కుక్క అరవడం మొదలు పెట్టింది. ఆ చిరుతను కుక్క తరిమి వేయాలని ప్రయత్నిస్తూ అటూ ఇటూ తిరిగింది. కానీ మాటు వేసిన చిరుత ఒక్కసారే కుక్కపై దూకి దాన్ని నోట్లో కరుచుకొని తీసుకు వెళ్ళింది. అయితే ఇదంగా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు కావడంతో కుటుంబ సభ్యులు చూసి ఒక్కసారే వణికిపోయారు. ఈ విషయం తెలిసిన గ్రామస్థులు సైతం భయాందోళనకు గురయ్యారు. అయితే అటవీ అధికారులు అత్యవసరం అయితేనే రాత్రిపూట జనాలు బయటకు రావాలని సూచించారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#WATCH | Leopard entered a residential area in Mungsare village of Nashik, attacked a pet dog yesterday
(Source: CCTV) pic.twitter.com/OznDoeQvHR
— ANI (@ANI) June 6, 2022