గత రెండేళ్లుగా దేశ వ్యాప్తంగా కరోనా కలకలం సృష్టించింది. సెకండ్ వేవ్ ముగిసిందీ అనుకునేలోపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తన ప్రతాపాన్ని చూపించింది. ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలు ఆంక్షలను ఎత్తివేస్తున్నాయి. అయితే కరోనా ప్రభావం వ్యాపార రంగంపై దారుణంగా పడింది. ముఖ్యంగా ట్రావెలింగ్ రంగంపై కోవిడ్ దెబ్బ తీవ్రంగా పడిందని అంటున్నారు. ముఖ్యంగా పర్యాటక రంగానికి కరోనా తీవ్ర నష్టాలను మిగిల్చింది.
ఈ నేపథ్యంలోనే బస్సులను కిలో రూ.45 చొప్పున తుక్కు కింద విక్రయించారు కేరళలోని ఓ పర్యటక బస్సుల యజమాని. కరోనా ఆంక్షల కారణంగా తీవ్రంగా నష్టపోయి రోడ్డున పడినట్లు చెప్పారాయన. ఇదే పరిస్థితి ఇతర బస్సు యజమానులు కూడా ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అయితే బస్సులను తుక్కు కింద విక్రయించాలని నిర్ణయం తీసుకోవడం ఆర్థిక సమస్యలకు అద్దం పడుతోంది. వివరాల్లోకి వెళితే..
ఇది చదవండి: మరో వివాదంలో నటి శిల్పా శెట్టి.. కోర్టు సమన్లు!
కేరళకు చెందిన రాయ్సన్ జోసెఫ్ టూరిజానికి సంబంధి వ్యాపారం చేస్తున్నారు. ఆయన వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు 20 వరకు ఉండేవి. కరోనాకు ముందు ఆయన వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగింది. కరోనా సమయంలో నిబంధనల కారణంగా ట్రావెల్స్ రంగానికి భారీ షాక్ తగిలింది. భారీగా నష్టపోయిన జోసెఫ్ ఇక బస్సులను భరించడం తన వల్ల కాదని ఇదివరకే 10 బస్సులను తుక్కు కింద విక్రయించాడు. కేవలం కేజీ రూ.45 చొప్పున తుక్కు కింద ట్రావెల్స్ బస్సులను అమ్మేశారు. కోచి కేంద్రంగా రాయ్ అనే పేరుతో ట్రావెల్స్ సేవలు అందించేవారు. కోవిడ్ ఎఫెక్ట్ తో టూరీజం పై పెద్ద దెబ్బ పడటంతో ఆయనకు ఈ కష్టాలు వచ్చాయి.
ఇది చదవండి: వలలో పడ్డ రాకాసి చేప! దీన్ని టచ్ చేస్తే…
బస్సులను నడిపినా అసలు పెట్టుబడి కూడా చేతికి రాకపోవడంతో బస్సులను స్క్రాప్ చేసి విక్రయిస్తున్నాడు. ఈ పరిస్థితి రాయ్సన్ జోసెఫ్ ఒక్కడిది మాత్రమే కాదని.. అనేకమంది యజమానులు ఇలాంటి గడ్డుకాలాన్నే ఎదుర్కొంటున్నట్లు కేరళలోని బస్సు యజమానుల సంఘం కాంట్రాక్ట్ క్యారేజ్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీసీఓకే) పేర్కొంది. మహమ్మారి కారణంగా రాష్ట్రంలో మొత్తం టూరిస్ట్ బస్సుల సంఖ్య 14వేల నుంచి 12వేలకి తగ్గినట్లు తెలిపింది. కుటుంబాన్ని పోషించుకునేందుకు దిక్కు తోచని పరిస్థితుల్లో మిగతా బస్సులను కూడా స్క్రాప్ చేసి తుక్కు కింద విక్రయిస్తున్నారు. కోవిడ్ ప్రభావం ఎంత దారుణంగా ఉందో ఇదో ఉదాహారణ.. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.