ఒకప్పుడు పెళ్లి అంటే ఐదు రోజుల పాటు జరిగే వేడుక. ఆ తర్వాత అది కాస్త గంటల వ్యవధికి వచ్చింది. కాలం మారుతున్న కొద్ది.. కొన్ని సంస్కృతులు కనుమరుగయితే.. కొత్తవి పుట్టుకొస్తున్నాయి. అలా మన తెలుగు వివాహ వేడుకల్లో కూడా కొన్ని కొత్త ఆచారాలు వచ్చి చేరాయి. ఇక వీటితో పాటు ప్రస్తుతం ప్రీవెడ్ షూట్ కూడా అన్ని ప్రాంతాలకు వ్యాపించింది. గతంలో పెళ్లి వేడుక జరిగేటప్పుడు మాత్రమే ఫోటోలు తీసేవారు. కానీ ఇప్పుడు వివాహానికి ముందే ప్రీ వెడ్ షూట్ పేరుతో ఫోటో సెషన్ నిర్వహిస్తున్నారు.
జీవితంలో పెళ్లి అంటేనే మధురమైన జ్ఞాపకం కాబట్టి.. దాన్ని ఫోటోల రూపంలో బంధించి.. భద్రంగా దాచుకోవడం తప్పులేదు. అయితే తాజాగా జరుగుతున్న కొన్ని ప్రీవెడ్ షూట్ లలో.. కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా కోజికోడ్ సమీపంలోని కుట్టియాడికి చెందిన నవ జంట ఫొటో షూట్ చేస్తూ నది ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ ప్రమాదంలో వరుడు మృతి చెందగా.. వధువు పరిస్థితి విషమంగా ఉంది.
ఇది కూడా చదవండి: బురదలో ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్! కారణం?
వివరాల్లోకి వెళ్తే.. కడియంగడ్‌కు చెందిన రెజిల్, కార్తీక మార్చి 14న వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఫోటో షూట్ కోసం కట్టియాడి నది వద్దకు వెళ్లారు. అక్కడ ఫొటోలు దిగుతుండగా.. ప్రమాదవశాత్తు నది ప్రవాహంలో చిక్కుకుపోయారు. వారి అరుపులు విన్న స్థానికులు నదిలోకి దూకి ఇద్దిరినీ బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రెజిల్ మరణించగా.. ప్రస్తుతానికి కార్తీక పరిస్థితి విషమంగా ఉంది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.