వరకట్న వేధింపులకు బలైన ఆయుర్వేద వైద్య విద్యార్థిని విస్మయ కేసులో కేరళ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కేరళలోని కొల్లాం అదనపు సెషన్స్ కోర్టు-1 కిరణ్ కుమార్‌కు పదేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే 12.5 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. ఈ మొత్తాన్ని బాధితురాలి తల్లిదండ్రులకు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం తీర్పు వెలువరించింది.వరకట్న వేధింపులకు గురిచేసి ఆత్మహత్యకుప్రే రేపించినట్లు విశ్వసించిన కోర్టు కిరణ్ కుమార్‌ను సోమవారం దోషిగా నిర్ధారించింది.
విస్మయ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..కిరణ్ అనే వ్యక్తికి విస్మయని ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో 100 సవరల బంగారం, ఒక ఎకరా భూమి వరకట్నంగా కిరణ్‌కు ఇచ్చారు. వీటితోపాటు రూ.10 లక్షల విలువైన ఓ కారును కూడా ఇచ్చారు. అయితే ఆ కారును కిరణ్ ఇష్టపడలేదు. దానికి బదులుగా నగదు ఇవ్వాలని కోరాడు. అందుకు విస్మయ కుటుంబీకులు తిరస్కరించారు. దీంతో విస్మయను కిరణ్ నిరంతరం వేధించేవారు. కొన్ని రోజుల తరువాత విస్మయ ఇంట్లో శవమై కనిపించింది. తమ కూతురిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరిపించి చంపేశారని విస్మయ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: భార్య అనుకుని నిద్రిస్తున్న పరాయి మహిళపై దారుణం!అతడిపై కేసు పోలీసులు కేసు నమోదు చేశారు. చాలాకాలంగా ఈ కేసుపై వాదోపవాదనలు కొనసాగాయి. గతంలో కిరణ్ కి సుప్రికోర్టు బెయిల్ మంజూరు చేసింది. తాజా తీర్పుతో ఆయనను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విస్మయ తండ్రి మాట్లాడుతూ, తన కుమార్తెకు న్యాయం జరిగిందన్నారు. ప్రాసిక్యూషన్, ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎంతో గొప్పగా కృషి చేసిందని, వారికి కృతజ్ఞతలు చెప్తున్నానని తెలిపారు. కృతజ్ఞతలు వ్యక్తం చేయడానికి మాటలు లేవని ఆయన అన్నారు. మరి..భార్యను వేధించి.. ఆమె ఆత్మహత్య చేసుకనేలా ప్రేరేపించిన కేసులో కోర్టుఇచ్చిన తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.