రాను రాను వివాహ బంధానికి సమాజంలో విలువే కరువవుతోంది. కట్టుకున్న వాళ్లను కాదని.. క్షణిక సుఖంకోసం పాకులాడుతున్న గొప్ప వాళ్లు ఎందరో ఉన్నారు. ప్రియుడి కోసం భర్తను హతమార్చిన భార్య, ప్రేయసి కోసం భార్యను కడతేర్చిన భర్త అని నిత్యం వార్తలు చదువుతూనే ఉన్నాం. వయసు, వావివరసలు, విచక్షణ అన్నీ మరిచి వివాహేతర సంబంధాలతో పేట్రేగిపోతున్నారు. దొరికాకే దొంగ అనే రీతిలో రెచ్చిపోతున్నారు. కొందరైతే నలుగురికి చెప్పే స్థానంలో ఉండి కూడా పక్క చూపులు చూస్తూ పిచ్చి వేషాలు వేస్తున్నారు. అలా పక్కదారి పట్టిన ఓ మాజీ మంత్రిని తమ భార్య కాపుకాసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని.. గట్టిగానే బుద్ధి చెప్పింది.
వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ లోని కాంగ్రెస్ సీనియర్ నేత భరత్ సింగ్ సోలంకి మరో యువతితో భార్యకు అడ్డంగా దొరికిపోయాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి భార్య అవకాశం కోసం ఎదురు చూసి యువతితో ఉండగా భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ముందుగానే పక్కాగా ప్లాన్ చేసుకున్న ఆమె మనుషులతో వెళ్లి తలుపు తీసిన దగ్గర నుండి మొత్తం వీడియో తీసింది. గదిలో తన భర్తతో యువతిని చూసిన ఆమె కోపంతో ఊగిపోయింది.
Gujarat Congress Leader #BharatSolanki caught with half his age girl..
Time for another chintan shivir…
बताओ इनकी तपस्या में क्या कमी थी…😂Video & Content Credit : @dhaval8456 pic.twitter.com/Fc7Vb80uMQ
— Anil_J_IV🇮🇳 (@follow_amj) June 1, 2022
ఒక్క ఉదుటున ఆమెపైకి దూకి జుట్టు పట్టుకొని కొట్ట సాగింది. భయంతో కంగారు పడిన మాజీ మంత్రి సోలంకి ఆమెను నిలువరించే ప్రయత్నం చేశాడు. ఆమె అలా కొట్టే బదులు పోలీసు కేసు పెట్టుకోవచ్చు కదా అని ఉచిత సలహా కూడా ఇచ్చాడు. భార్య నుంచి యువతిని కాపాడేందుకు ఆ మాజీ మంత్రి చాలానే కష్టపడ్డాడు. ఆ యువతిని కూర్చోబెట్టి ఫోన్లలో వీడియోలు తీస్తూ ఆ మహిళ ప్రశ్నించింది. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మాజీ మంత్రి నిర్వాకంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Gujarat Congress leader Bharat Singh Solanki Extra Marital Affair…Wife Caught and Make video pic.twitter.com/JlHMZJZpTw
— Dheeraj sharma (@dheer23) June 1, 2022