మన దేశం ఎన్నో మతాలు, సంప్రదాయాలకు పుట్టిల్లు. అన్ని మతాల ప్రజలు పరమత సహనం పాటిస్తూ.. కలిసిమెలసి జీవిస్తుంటారు. వారికే ప్రత్యేకమైన పండుగలు జరుపుకుంటూ, ఆచారాలను పాటిస్తూ జీవితాలను కొనసాగిస్తుంటారు. అయితే ఈ ఆచార సంప్రదాయాలు పాటించే విషయంలో పలువురు సెలబ్రిటీలు అప్పుడప్పుడు విమర్శలు ఎదుర్కొంటారు. కొన్ని హింసాకత్మంగా ఉండే ఆచారాల విషయంలో.. సామాన్యులంటే సరే కానీ.. ప్రజా ప్రతినిధులుగా ఉండి ఇలాంటి పనులు చేయడం ఏంటని విమర్శిస్తారు. ప్రస్తుతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు గుజరాత్‌కు చెందిన ఓ మినిస్టర్. ఆయన తీరుపై విమర్శలు గుప్పింస్తుండగా.. ఇది మూఢనమ్మకం కాదు.. ఆచారం. నా చిన్నతనం నుంచి ఇదే విధంగా చేస్తున్నాను అంటూ వివరణ ఇచ్చారు. అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఇది చదవండి..
గురువారం (మే 26,2022)రాజ్ కోట్ లో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో మంత్రి అరవింద్ పాల్గొన్నారు. అక్కడి దేవతా పూజలో భాగంగా ఇనుప గొలుసులతో తనను తాను బాదుకుని శిక్షించుకున్నారు. ఆ సమయంలో అక్కడ ఒక వ్యక్తి మినిస్టర్‌పై కరెన్సీ నోట్లను వెదజల్లాడు. ఇందుకు సంబంధించిన తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరలవ్వడమే కాక విమర్శలు కూడా వస్తున్నాయి. మంత్రి అయి ఉండి ఇటువంటి మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తారా? అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై కాంగ్రెస్ గుజరాత్ అధికార ప్రతినిధి మనీష్ దోషి మాట్లాడుతూ మంత్రిగా ఉండి..ఇటువంటి అశాస్త్రీయమైన చర్యలతో మూఢనమ్మకాలను వ్యాప్తి చేయడం దురదృష్టకరమని విమర్శించారు.
ఇది కూడా చదవండి: Gujarat: ప్రియురాలి మీద కోపంతో ఆమె చెల్లి పెళ్లికి బాంబ్‌ని గిఫ్ట్‌గా పంపిన వ్యక్తి!
తనపై వస్తున్న విమర్శలపై అరవింద్ స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..‘‘నా చిన్న నాటి నుంచి దేవతకు భక్తుడిని. మా స్వగ్రామంలో మా కుటుంబం కూడా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంది. దీన్ని మూఢనమ్మకం అని అనొద్దు. నమ్మకం, మూఢనమ్మకం మధ్య ఓ పలచని గీత ఉంటుంది. దాని ఆధారంగా మసులుకోవాలి’’ అని వివరించారు. అలానే కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న విమర్శలపై బీజేపీ గుజరాత్ అధికార ప్రతినిధి యగ్నేష్ దవే స్పందించారు. సంప్రదాయ ఆచారాలను మూఢనమ్మకాలుగా పేర్కొనకూడదని.. మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం కాంగ్రెస్ మానుకోవాలని అన్నారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણી ધુણ્યા#ArvindRaiyani@BJP4Gujarat pic.twitter.com/8GgsYJZ7rL
— narendra Ahir (@pithiyanarendra) May 27, 2022
ఇది కూడా చదవండి: 3 రోజులుగా ఆకాశం నుంచి పడుతున్న వింత వస్తువులు.. భయాందోళనలో జనాలు!