పురిటి నొప్పులను సైతం లెక్కచేయకుండా.. బిడ్డను కడుపులో తొమ్మిది నెలలు మోసే కన్న తల్లి.. తన బిడ్డను ఎంత అపురూపంగా చూసుకుంటుందో మన అందరకి తెలిసిందే. ఒక్క నిముషం తన బిడ్డ కన్పించక పోతే ఆ తల్లి తల్లడిల్లిపోతుంది. అలాంటి అమ్మ తనానికి ఓ తల్లి మాయని మచ్చ తెచ్చింది. హోంవర్క్ చేయలేదనే కారణంతో.. కాళ్లుచేతులు కట్టేసి.. బిడ్డను ఎర్రటి ఎండలో పడేసింది. ఆ ఎండకు తట్టుకోలేక.. ఆ చిన్నారి పడుతున్న కష్టం అందరిని కంటతడి పెట్టిస్తోంది. ఈ ఘటన ఢిల్లీలోని ఖాజూరీ ఖాస్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
చిన్నారి హోమ్ వర్క్ చేయలేదనే కారణాన్ని సాకుగా చూపిన తల్లి.. బిడ్డను కాళ్లు చేతులు కట్టేసి.. ఎర్రటి ఎండలో పడుకోబెట్టింది. ఆ ఎండను భరించలేక ఆ చిన్నారి విలవిలలాడిపోయింది. వేడికి తట్టుకోలేక.. ఆ కట్లను తెంచుకోలేక బాధతో రోదించింది. ఈ ఘటనను పక్కింటి వారు వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అది కాస్తా పోలీసుల కంట పడింది. అయితే ఈ వీడియో ఎక్కడ? ఎందుకు? జరిగిందనే విషయాన్ని ఎట్టకేలకు పోలీసులు చేధించారు. ఢిల్లీలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. కూతురు హోం వర్క్ చేయకపోవడంతోనే అలాంటి శిక్ష విధించానని ఆ చిన్నారి కన్నతల్లి చెప్పిందని పోలీసులు తెలిపారు. ఐదు, పదినిమిషాలు మాత్రమే అలా ఉంచి.. తర్వాత ఇంట్లోకి తీసుకొచ్చానని ఆమె వివరణ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Swiggy Boy: వైరల్ వీడియో: ట్రాఫిక్ పోలీస్ ఓవరాక్షన్.. అకారణంగా స్విగ్గీ బాయ్‌పై దాడి..
జూన్ 2వ తేదీన ఈ ఘటనకు సంబంధించిన వీడియో కరావాల్ నగర్ నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది. ఈ ఘటనను పోలీసులు తీవ్రంగానే పరిగణించారు. ఆపై స్థానికంగా ఆ ఘటన ఎక్కడా జరగలేదని పోలీసులు కన్ఫర్మ్ చేసుకున్నారు. ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఓ వ్యక్తి.. ఘటన సమయంలో పక్కనే ఉన్న బిల్డింగ్‌లో నుంచి వీడియో తీసినట్లు తేలింది. అతని ద్వారా మొత్తానికి ఇప్పుడు ఈ వీడియోను పోలీసులు చేధించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.