దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. ఇటీవల కేసుల సంఖ్య భారీగా తగ్గిన విషయం తెలిసిందే. రోజూ 10వేలకు తక్కువగా కేసులు నమోదవుతున్నా.. పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ వస్తున్నాయి. దేశంలో మొత్తం 415కు పెరిగింది. 17 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు దడ పుట్టిస్తున్నాయి. ఇప్పటివరకు ఒమిక్రాన్ నుంచి 115 మంది కోలుకున్నారు.
గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 7,189 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య శాఖ ప్రకటించింది. 7,286 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 387 మంది ప్రాణాలు కోల్పోయారు.దేశంలో ప్రస్తుతం 77,032 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 3,42,23,263 మంది కోలుకున్నారు. అదే విధంగా మృతుల సంఖ్య మొత్తం 4,79,520కు చేరుకుంది. దేశంలో ఇప్పటివరకు 141.01 కోట్ల డోసుల వ్యాక్సిన్ వినియోగించారు.
ఇది చదవండి : తెలంగాణలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు, హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అలర్ట్ చేస్తూ లేఖ రాసింది. ఒమిక్రాన్ కట్టడి చేయడానికి అవసరమైతే ‘నైట్ కర్ఫ్యూ’ పెట్టాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. ఈ వేడుకల్లో ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. జన సమూహాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, వివాహాలు, అంత్యక్రియలకు హాజరయ్యే వారి సంఖ్యను తగ్గించాలని కోరింది.
#Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/5fNctxt0He pic.twitter.com/0MFdPq8WjR
— Ministry of Health (@MoHFW_INDIA) December 25, 2021