పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటారు. పెద్దల దీవెనలు వారి సమక్షంలో ఒక్కటవుతారు నవదంపతులు. అలాంటి పెళ్లి మండపానికి పీకలదాక తాగి వచ్చే వరులకు వధువులు షాక్ ఇస్తున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. మరికొద్ది సేపట్లో వధువు మెడలో తాళి కట్టాల్సి ఉండగా.. వరుడు తప్పతాగి పెళ్లి మంటపానికి తూలుతూ వచ్చాడు. అది గమనించిన వధువు తండ్రి వరుడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ఈ ఘటన ఏప్రిల్ 24న జిల్లా మల్కాపూర్ పాంగ్రా గ్రామంలో జరిగింది.
మాట్కాపూర్ పాంగ్రా గ్రామానికి చెందిన ఒక యువతికి పక్క ఊరిలో ఉంటున్న యువకుడితో వివాహం నిశ్చయం అయ్యింది. ఇరు కుటుంబాల వారుపెళ్లి ఏర్పాటు ఆర్భాటంగా చేశారు. ముహూర్త సమయం రానే వచ్చింది.. పెళ్లి పెద్దలు అందరూ వచ్చారు. పెళ్లికి అంతా సిద్దమైనప్పటికీ వరుడు మండపానికి రాలేదు. అక్కడ అందరూ ఆశ్చర్యపడేలా వరుడు పీకలదాకా తాగి ఆ మైకంలో బ్యాండ్‌కు అనుగుణంగా డ్యాన్స్ చేస్తున్నారు.
అసలు పెళ్లి సమయంలో తాగడమే తప్పు.. పైగా ముహూర్త సమయం దాటిపోతున్నా డ్యాన్స్ చేస్తూ ఉండటం చూసిన పెళ్లి కూతురు తండ్రి ఆవేశం కట్టలు తెంచుకుంది.. ఆ ఊరేగింపు ని వెనక్కి పంపించారు. అదే మండపంలో మరో యువకుడితో పెళ్లి జరిపించారు. ఈ విషయంపై అక్కడ అంతా చర్చ కొనసాగుతుంది.. పెళ్లి కూతురు తండ్రి చేసిన పని సరైనదే అని కొందరు వారికి మద్దతు ఇస్తున్నారు.