ఈ మధ్యకాలంలో సమాజంలో వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆడ, మగ అనే తేడా లేకుండా.. వయసుతో సంబంధం లేకుండా.. అనైతిక బంధాలకు ఆకర్షితులవుతూ.. జీవితాలను నాశనం చేసుకుంటున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. అంతేకాక ఇలాంటి అనైతిక సంబంధాల మోజులో పడి.. భాగస్వామిని అడ్డు తొలగించుకోవడం కోసం ఏకంగా మాస్టర్ ప్లాన్‌లే వేస్తున్నారు. వీరి ఆలోచనలు చూసి పోలీసులే అవాక్కవుతున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి బిహార్‌లో చోటు చేసుకుంది. వివాహేతర సంబంధంలో ఉన్న ఓ మహిళ.. భర్తను అడ్డుతొలగించుకోవడం కోసం మాస్టర్ ప్లాన్ వేసింది. ప్రియుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. ఆ తర్వాత ఆమె కుటుంబ సభ్యుల చేత భర్త మీద ఫిర్యాదు చేయించి.. జైలుకు పంపింది. కానీ అనుమానం వచ్చిన పోలీసులు.. లోతుగా దర్యాప్తు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: Massage: వీడియో: కంప్లైంట్ చేయడానికి వెళ్లిన మహిళతో మసాజ్ చేయించుకున్నాడు!
బిహార్, మోతిహరి జిల్లాకు చెందిన శాంతి దేవికి, దినేష్ రామ్‌తో 2016లో పెళ్లి జరిగింది. అయితే, గత ఏప్రిల్ 19న శాంతి దేవి ప్రియుడితో కలిసి పంజాబ్‌లోని జలంధర్ పారిపోయింది. శాంతిదేవి కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు, శాంతిదేవి భర్త దినేష్ రామ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శాంతిదేవిని, దినేష్ కొంతకాలంగా వేధిస్తున్నాడని, ఇటీవల అదనపు కట్నం కోసం వేధించాడని, ఆమె కోసం అన్నిచోట్లా వెతికినా దొరకలేదని, దినేష్ రామే తమ కూతురును చంపి ఉంటాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు హత్యా నేరం కింద దినేష్ రామ్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం దినేష్ రామ్ జైల్లో ఉన్నాడు. అయితే, ఈ కేసు విషయంలో పోలీసులకు ఇంకా ఏదో అనుమానం వచ్చింది. టెక్నికల్ డిపార్ట్‌మెంట్ సాయంతో, శాంతి దేవి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పంజాబ్‌లోని జలంధర్‌లో ఆమె ఫోన్ వినియోగంలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లి వెతికారు.
ఇది కూడా చదవండి: Love Marriage: పదేళ్ల క్రితం విడిపోయిన ప్రేమికులు.. ఇప్పుడు ‘మళ్లీ’ పెళ్లి చేసుకున్నారు!అక్కడ దృశ్యం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే తామ చనిపోయింది అని భావించిన శాంతి దేవి.. ఇక్కడ ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. పోలీసులు శాంతిదేవిని మోతిహరికి తీసుకొచ్చి తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. వివాహేతర సంబంధం కోసం ఏకంగా చనిపోయినట్లు పోలీసులను నమ్మించిన శాంతి దేవి ఆలోచనలు చూసి అధికారులు ఆశ్చర్యపోతున్నారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: 28 ఏళ్ల జైలుశిక్ష అనుభవించాక నిర్దోషిగా తేల్చిన కోర్టు.. ఇప్పుడతని పరిస్థితి ఏంటి!