సాధారణంగా దేవాలయాల వద్ద ఎంతో మంది యాచకులు ఎంతో దీన స్థితిలో ఉంటూ బిక్షం ఎత్తుకుంటారు. గుడికి వెళ్లి వారు పుణ్యం వస్తుందని వారికి దానం చేస్తుంటారు. ఇటీవల కొంత మంది యాచకులు తమ గొప్ప మనసు చాటుకుంటున్నారు. ఎక్కడైతే తాము యాచించి డబ్బు కూడబెట్టారో అదే గుడికి విరాళం ఇస్తూ దైవ సేవలో పాల్గొంటున్నారు. ఒక యాచకురాలు మరోసారి గొప్ప మనసు చాటుకుంది. తాను.. రోజు యాచించిన సోమ్మును ఆలయ అభివృద్ధి కోసం దేవుడికే తిరిగి ఇచ్చింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
కర్ణాటకలోని మంగళూరులో అశ్వత్తమ్మ యాచకురాలిగా జీవనం సాగిస్తుంది. భర్త చనిపోయిన తర్వాత ఆమె కుటుంబానికి దూరమై దేవాలయాల వద్ద భిక్షాటన చేస్తు జీవనం సాగిస్తుంది. గత 18 సంవత్సరాలుగా పలు దేవాలయం వద్ద భిక్షాటన చేస్తుంది. అశ్వత్తమ్మ వచ్చిన డబ్బులో తన ఖర్చులకు మినహా.. మిగతా సొమ్మంతా దాన ధర్మాలు, దేవాలయాలకు విరాళాలు ఇస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే ఆమె గొప్ప మనసు చాటుకుంది.
దేవాలయాల వద్ద తాను బిక్షం ఎత్తుకున్న డబ్బుతో ఉడిపి జిల్లాలోని పొలాలి గ్రామంలో క్షేత్ర రాజరాజేశ్వరి ఆలయ వార్షిక జాత్ర మహోత్సవాలు జరుగుతుండగా అశ్వతమ్మ లక్ష రూపాయలను అందజేసింది. నిస్వార్థంగా ఆమె చూపించిన దాతృత్వాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ గా మారింది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.