కష్టపడి చదివి.. పోలీసు ఉద్యోగం సంపాదించింది. విధి నిర్వహణలో నిజాయితీగా ఉంటూ.. మంచి పేరు సంపాదించుకుంది. బిడ్డను బాగా చదివించాం.. మంచి ఉద్యోగం కూడా తెచ్చుకుంది.. ఇక మంచి వ్యక్తిని చూసి తనకు పెళ్లి చేస్తే సరి అని ఆమె తల్లిదండ్రులు భావించారు. సంబంధం కోసం వెతుకుతుండగా.. వారికి ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు.. గొప్ప ఉద్యోగం అని నమ్మబలికాడు. దాంతో ఆమె తల్లిదండ్రులు సదరు వ్యక్తితో కుమార్తె వివాహం నిర్ణయించారు. పెళ్లికి మరి కొన్ని నెలల సమయం ఉండగా.. కాబోయే వాడు పెద్ద మోసగాడు అని ఆమెకు తెలిసింది. అంతే క్షణం ఆలస్యం చేయకుండా.. అతగాడిని అరెస్ట్ చేసింది. ఆమె చూపిన ధైర్యంపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: Sisters: కోటిన్నర విలువైన భూమిని మసీదుకు రాసిచ్చిన మహిళలు.. ఒక కన్నీటి కథే ఉంది!
అసోంకు చెందిన జన్మోనీ రభా నాగావ్‌లో పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గత అక్టోబరులో రానా పోగాగ్ అనే వ్యక్తితో ఆమెకు నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది నవంబర్‌లో ఆమె వివాహం జరగాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. రానా పోగాగ్ తనను తాను ఓ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్(పీఆర్వోగా) జున్మోనీ కుటుంబానికి పరిచయం చేసుకున్నాడు. లేడీ ఎస్సైతో వివాహం కుదరడానికి ముందు అతగాడు.. తాను ఓఎన్జీసీలో పని చేస్తున్నానని చెప్పుకుని.. ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి.. అమాయకుల వద్ద నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశాడు. ఆ తర్వాత ముఖం చాటేశాడు.
ఇది కూడా చదవండి: Young Girl పెళ్లికూతుర్లకు ఉచితంగా బట్టలు అందిస్తున్న పేద యువతి! ఎందుకంటే..
ఈ క్రమంలో రానా పోగాగ్‌కు కాబోయే భార్య ఒక ఎస్సై అని, పైగా నిజాయితీకి మారుపేరని తెలియడంతో ముగ్గురు బాధితులు ఆమెను ఆశ్రయించారు. దీంతో వాళ్ల నుంచి ఫిర్యాదు తీసుకుని మరి రానా పోగాగ్‌ను అరెస్ట్ చేసింది. మధ్యవర్తి ద్వారా వచ్చిన ఆ సంబంధాన్ని పెద్దలు తీసుకురావడంతో అతగాడు మంచి వ్యక్తి అని తాను నమ్మానని చెబుతోంది. ఇదిలా ఉంటే.. జున్మోనీకి ధైర్యశాలి అధికారిణి అనే పేరుంది. గతంలో ఎంతో సంక్షిష్టమైన కేసుల్ని సాహసోపేతంగా డీల్ చేశారామె. అందుకే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయంలోనూ ఆమె డేరింగ్ స్టెప్ తీసుకుందని పలువురు కొనియాడుతున్నారు. ఆమె స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. ఈ లేడీ అధికారి సాహసంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Marriage:పెండ్లితో ఒక్కటైన 3 అడుగుల అబ్బాయి, 2 అడుగుల అమ్మాయి!