ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఓ మధురమైన వేడుక. అలాంటి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని చాలా మంది భావిస్తారు. అందమైన దుస్తులు, వస్తులు.. ఇలా తమకు నచ్చిన విధంగా పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కంటారు. కానీ కొందరి మాత్రమే ఆ కలలు నిజమవుతాయి. మరికొందరికి కలలు కలలుగానే మిగిలిపోతాయి. కారణం పేదరికం . దీని కారణంగా పెళ్లి విషయంలో వారి కోరికలను చంపుకుంటారు. ఉన్నదాంట్లో ఏదో కానిచ్చేస్తారు. అయితే ఓ యువతి మాత్రం అలాంటి వారి కోసం పెళ్లికి బట్టలు ఉచితంగా అందిస్తోంది. బట్టలు ఉచితంగా ఇస్తుందంటే.. ఆమె ఏదో ధనవంతురాలు అనుకుంటారేమే.. కాదు ఆమెది పేద కుటుంబం. మరి.. ఆ యువతి ఎందుకు అలా చేస్తోందో.. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కర్ణాటక రాష్ట్రంలో మడికేరి తాలుకాలో ఛెత్తల్లి అనే గ్రామానికి చెందిన యువతి షెహరాబాను. తల్లిదండ్రులు అమీనా, మాను రోజువారీ కూలీలు. ఆ డబ్బుతోనే ఇళ్లు గడిచేది. షెహరాబానుకు బ్యూటీషియన్ గా మంచి అనుభవం ఉంది. దానితో పాటు ఇతరలకు సహయం చేయాలనే స్వభావం కలిగిన యువతి. తన స్నేహితులకు పెళ్లి కుదిరినప్పుడు.. వారు అనుకున్న దుస్తులను కొనుగోలు చేయలేక అసంతృప్తిగా ఉండటం షెహరాబాను గమనించింది. ఇలాంటి వాళ్ల కోసం ఏదో ఒకటి చేయాలని అప్పుడే నిర్ణయించుకుంది. ఈ క్రమంలో కేరళలో పేద వధువుల కోసం పెళ్లి దుస్తులను ఉచితంగా అందిస్తున్న బొటిక్ గురించి తెలుసుకుంది. అంతే తన గ్రూపుల్లో ఈ బొటిక్ గురించి వివరిస్తూ పోస్టులు పెట్టింది. చాలామంది స్పందించి, చేయుతనందిచారు.
ఇదీ చదవండి: రైతును వరించిన అదృష్టం.. రాత్రికి రాత్రే దశ తిరిగింది!
వారి వద్ద ఉన్న మంచి చీరలను విరాళంగా ఇవ్వడం మొదలుపెట్టారు. అలా ఫ్యాన్సీ దుస్తులు కూడా వచ్చాయి. ఇలా వచ్చిన దుస్తులన్నింటినీ డ్రైక్లీనింగ్ చేయించేది. వాటికోసం ఓ చిన్న దుకాణాన్ని తెరిచింది. నిరుపేద లేదా యువతులు అనాథ యువతులు తమ పెళ్లి సమయంలో అక్కడి వెళ్లి నచ్చిన దుస్తులను ఎంపిక చేసుకోవచ్చు. సోషల్ మీడియా ద్వారా కొందరు వధువులు ఆమెను సంప్రదిస్తారట. నచ్చిన దుస్తులను వారి సైజుకు తగినట్లుగా మార్చి అందిస్తున్నా. ఆ సమయంలో వారి ముఖంలో కనిపించే ఆనందం ఇచ్చే తృప్తి కొన్ని కోట్లు ఇచ్చినా రాదు అని గర్వంగా చెబుతుంది షెహరాభాను. మరి.. పేద పెళ్లికూతుర్ల కొర్కెల తీర్చేందుకు కృషి చేస్తున్న ఈ యువతిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి