జన్యు పరమైన కారణాల వల్ల ఓ వ్యక్తి 3 అడుగులకే పరిమితమయ్యాడు. అయినా ఆ విషయాన్ని అతను ఏనాడూ పట్టించుకోలేదు. ఉన్నత చదవులు అభ్యసించి.. కుటుంబాన్ని ఆర్థిక కష్టాల నుంచి బయట పడేయాలనుకున్నాడు. అనుకున్నట్లేగానే ఉన్నత చదువులు అభ్యసించాడు. మంచి మార్కులతో ఎంబీఏ పట్టా పొందాడు. అనంతరం ఉద్యోగం కోసం వేట ప్రారంభించాడు. ఈ క్రమంలో అతడికి చుక్కెదురైంది. అతడిలో ఉన్న వైకల్యాన్ని చూసిన చాలా మంది ఉద్యోగం ఇచ్చేందుకు నిరాకరించారు. అయితే తాజాగా చోటు చేసుకున్న ఒకే ఒక్క ఘటన అతడి జీవితాన్నే మార్చేసింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ప్రాంతానికి చెందిని అంకేశ్ కోస్తీ (28) ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. అతడి తల్లి ఫ్యాక్టరీలో బీడీ కార్మికురాలుగా పని చేస్తుంటే.. తండ్రి సెలూన్‌ను నడుపుతన్నాడు. అంకేశ్‌కు ఇద్దరు సోదరులు, ఓ సోదరి కూడా ఉన్నారు. చాలీచాలని డబ్బుతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తల్లిదండ్రులను చూస్తూ పెరిగిన అంకేశ్.. ఉన్నత చదువులు అభ్యసించి కష్టాలకు పుల్‌స్టాప్ పెట్టాలనుకున్నాడు. మంచి ఉద్యోగం పొంది తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాలని భావించాడు. పట్టుదలతో ఎంబీఏ పూర్తి చేశాడు. అనంతరం ఉద్యోగం కోసం వేట ప్రారంభించాడు. 3 అడుగులే ఉన్న కారణంగా అతడికి ఉద్యోగం ఇచ్చేందుకు కంపెనీలు నిరాకరించాయి.
ఇది కూడా చదవండి: నాడు చావాలనుకున్నాడు.. నేడు పది మందిని బతికిస్తున్నాడు..
#धन्यवाद_ग्वालियर_दक्षिण_
सारी परिस्थिति प्रतिकूल होने के बाद भी अंकेश ने हिम्मत नहीं हारी MBA किया और अब फिर दूसरी पारी के लिए तैयार है उम्मीद है आज शाम तक अंकेश को नौकरी भी मिल जाएगी ॥कई लोगों के अब तक अंकेश के लिए फ़ोन आ चुके हैं अब उसे चयन करना है की उसे नौकरी कहाँ करना है ॥ pic.twitter.com/bA6vMfHWZS— Praveen Pathak (@PRAVEENPATHAK13) April 12, 2022
అయితే.. అంకేశ్ మాత్రం తన ప్రయత్నాన్ని ఆపలేదు. తన వైకల్యాన్ని కాకుండా ప్రతిభను చూసి ఏదో ఒక కంపెనీ తనకు జాబ్ ఆఫర్ చేస్తుందని గట్టిగా విశ్వసించాడు. రెండేళ్లపాటు నిర్విరామంగా ప్రయత్నించినా ఉద్యోగం లభించలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ సర్టిఫికెట్ పొందేందుకు ఎమ్మెల్యే సిఫార్సు లేఖ అవసరం అవడంతో స్థానిక ఎమ్మెల్యే ప్రవీణ్ పతక్‌కు కలిశాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే.. అంకేశ్ సమస్యలన్నింటినీ తెలుసుకుని భావోద్వేగానికి గురయ్యారు.
అనంతరం ఎమ్మెల్యే ప్రవీణ్ పతక్.. అతడితో ఓ సెల్ఫీ తీసుకుని.. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంకేశ్ చదువు వివరాలను తెలిపి, అతడికి ఉన్న జాబ్ అవసరాన్ని తెలియజేశారు. అంతే.. ఈ ఒక్క ఘటనతో అంకేశ్‌కు ఆఫర్ల వెల్లువలా వచ్చాయి. సుమారు 40 కంపెనీలు అంకేశ్‌కు జాబ్ ఆఫర్ చేశాయి.
ఇది కూడా చదవండి: సక్సెస్ స్టోరీ: నిందలు భరిస్తూ రూ.50 వేలతో చేసిన ప్రయత్నం రూ.20 కోట్లకు చేరింది!