సినీ ఇండస్ట్రీలో తనకంటూ మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న నటి నవనీత్ కౌర్ రాణా తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె భర్త రవి రాణా కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఇటీవల హిందుత్వ అంశం పై నవనీత్ కౌర్ చేసిన వ్యాఖ్యలు చేసిన సందడి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశఆయి. మహరాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే ఇంటి ఎదురుగా ఈ దంపతులు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని చెప్పడంతో ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రాణాలను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఇరువురిని ముంబై బాంద్రా మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి వారిద్దరికీ 14 రోజులు రిమాండ్ విధించారు.
హిందుత్వంపై గౌరవం ఉంటే సీఎం ఉద్ధవ్ థాకరే హనుమాన్ చాలీసా పఠించాలని వారు డిమాండ్ చేశారు. ఒకవేళ ఆయన పఠించకపోతే తాము సీఎం ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని ఇటీవల మీడియా లో నవనీత్ కౌర్ రాణా ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రాణాలు ప్రకటించారు. దీంతో ఇది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో నవనీత్ కౌర్ దంపతులు చాలీసా పఠించాలన్న తమ కార్యాచరణను విరమించుకున్నారు.
గౌరవం గల ప్రజా ప్రతినిధి స్థానంలో ఉంటూ.. ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైన పద్దతి కాదని పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఈ దంపతులు సోమవారం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తమకు వ్యతిరేకంగా దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరారు.