ధోని హెలికాప్టర్ షాట్ కి ఎంత క్రేజ్ ఉందో.. స్టైల్స్ విషయంలో కూడా అదే రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారు. ధోని టీమిండియాలో ఎంట్రీ ఇచ్చినప్పుడు జులపాల జుట్టుతో ఉన్నాడు. ఈ లుక్ చాలా ఏళ్ల పాటు ఫ్యాషన్ ప్రపంచాన్ని ఏలింది. ఆ తర్వాత ధోని ఏది చేసినా అదో కొత్త స్టైల్ అన్న ముద్ర పడిపోయింది. ఫ్యాషన్ విషయంలో స్టార్ హీరోలకు పోటీ ఇచ్చే ధోని ప్రస్తుతం కొత్త స్టైల్లో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు.
ఇంతకుముందు వచ్చిన ఐపీఎల్ 2022 సీజన్ ప్రోమోలో బస్పు డ్రైవర్‌గా కనిపించిన మహేంద్ర సింగ్ ధోనీ, గత సీజన్‌లో పూర్తి గుండుతో బౌద్ధ భిక్షువుగా, రాక్ స్టార్‌గా వివిధ గెటపుల్లో కనిపించి, కడుపుబ్బా నవ్వించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2022 సీజన్ లేటెస్ట్ ప్రోమోలో వయసు పెరిగినా, క్రికెట్‌పై ప్రేమ తగ్గని ముసలోడిగా కనిపించాడు మహేంద్ర సింగ్ ధోనీ. ఈ ప్రోమో కూడా మాహీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.
Kuch bhi karega to watch #TATAIPL, kyunki #YeAbNormalHai! 😉
What’s your plan when the action kicks off?
Watch it LIVE on March 26 on @StarSportsIndia & @disneyplus. pic.twitter.com/AnaMttJuDm
— IndianPremierLeague (@IPL) March 6, 2022
ఐపీఎల్ 2022 సీజన్‌కి సంబంధించన పూర్తి షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 26న మొదలయ్యే ఐపీఎల్ సీజన్ 15, మే 29న ఫైనల్‌తో ముగియనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య వాంఖడే వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ ప్రసార హక్కుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకునేందుకు వీలుగా స్ట్రాటెజిక్ టైమ్ అవుట్ సమయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుందట బీసీసీఐ. ఇంతకుముందు 150 సెకన్ల పాటు (రెండున్నర నిమిషాలు) ఉండే స్ట్రాటెజిక్ టైమ్ అవుట్ ను మూడు నిమిషాలకు (180 సెకన్లు) నిర్ణయం తీసుకుంది ఐపీఎల్ యాజమాన్యం.
When it’s the #TATAIPL, fans can go to any extent to catch the action – kyunki #YehAbNormalHai!
What are you expecting from the new season?@StarSportsIndia | @disneyplus pic.twitter.com/WPMZrbQ9sd
— IndianPremierLeague (@IPL) March 4, 2022