టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు అందం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అమ్మాయిల కలల రాకుమారిడిగా ముద్ర వేసుకున్నాడు మహేష్. హీరోయిన్లు సైతం మహేష్ గ్లామర్‌కు ఫిదా అవుతారంటే అతిశయోక్తి కాదు. చాలా మంది హీరోయిన్లు మహేష్ అందంపై బహిరంగంగానే ప్రశంసలు కురిపించారు.
ఇది కూడా చదవండి : మహేష్ బాబు వదులుకుంది ఈ పుష్ప మూవీనేనా?
ఈ క్రమంలో అందగాడిగా మహేష్ మరో అరుదైన రికార్డు సృష్టించారు.ప్రపంచ అందగాళ్ల జాబితాలో స్థానం దక్కించుకున్నారు మహేష్. ఈ జాబితాలో చేరిన రెండో భారతీయు నటుడిగా.. తొలి సౌత్ ఇండియా యాక్టర్‌గా రికార్డు సృష్టించాడు.
Most Handsome Men in the World 2021
10) Mahesh Babu (Rank 10)#MostHandsomeMan #MaheshBabu @urstrulyMaheshhttps://t.co/woDbyIcpV2 pic.twitter.com/YxsyYh9izF
— KIRAN 🔔 (@urstruly__kiran) December 22, 2021
చదవండి : కొత్త ఇంటి నిర్మాణం కోసం జూబ్లీహిల్సో లో స్థలం కొన్న మహేష్ బాబు
ప్రైమ్స్ వరల్డ్ వెబ్‌సైట్ 2021 ఏడాదికి గాను ప్రపంచంలోని టాప్ 10 అందమైన పురుషులు జాబితా విడుదల చేసింది. దీనిలో ఇద్దరు ఇండిన్ యాక్టర్లకు స్థానం లభించింది. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ మూడో స్థానంలో నిలవగా.. మహేష్ పదో స్థానంలో నిలిచాడు. ఈ ఘనత సాధించిన తొలి దక్షిణాది నటుడు మహేష్ బాబే. ఈ వార్త తెలిసి మహేష్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.