ఫిల్మ్ డెస్క్- కాజల్ అగర్వాల్.. ఒకప్పుడు టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. తెలుగుతో పాటు, దక్షిణాది బాషలన్నింటిలో అగ్ర హీరోలందరి సరసన నటించింది కాజల్. ఐతే పెళ్లి చేసుకున్నాక సినిమాలకు కాస్త దూరంగా ఉంటోంది.
అడపా దడపా సినిమాల్లో నటించిన కాజల్, గత కొన్ని రోజులుగా కేవలం ఇంటికే పరిమితం అయ్యింది. ఈ నేపధ్యంలో కాజల్ తల్లి కాబోతోందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కాజల్ ప్రెగ్నెన్సీ అని అభిమానులు సంబరపడినా కాజల్ గానీ, ఆమె భర్త కిచ్లు గానీ స్పందించలేదు.
కానీ ఇన్నాళ్లకు న్యూ ఇయర్ సందర్భంగా కౌజల్ భర్త గౌతమ్ కిచ్లు, కాజల్ అగర్వాల్ తల్లి కాబోతోందని అఫీషియల్‌గా అనౌన్స్ చేశాడు. ఈ కొత్త సంవత్సరంలో నీ రాక కోసం ఎదురు చూస్తున్నామంటూ గర్భవతి మహిళ ఎమోజీని క్యాప్షన్ తో ఓ ఫొటోను షేర్ చేశాడు కిచ్లు. దీంతో కాజల్ దంపతులకు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలో భర్త కిచ్లు ప్రకటన తరువాత కాజల్ అగర్వాల్ మొదటిసారి బేబీ బంప్ తో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. భర్తతో దిగిన ఓ ఫోటోను షేర్చేస్తూ 2022 అంటూ లవ్ సింబల్‌ను యాడ్ చేసింది చందమామ. ఈ ఫోటోలో కాజల్ అగర్వాల్ బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకేముంది కాజల్ ప్రెగ్నెన్సీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.