సోషల్ మీడియాలో అప్పుడప్పుడు గతంలో జరిగిన విషయాలు. వాటికి సంబంధించిన గుర్తులు కొన్నేళ్ల తర్వాత మళ్లీ తెరమీదకి రావడం, హాట్ టాపిక్ గా మారడం చూస్తుంటాం. అలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. కానీ ఒకసారి జనాల్లోకి వెళ్లిందంటే ఖచ్చితంగా నెట్టింట ట్రెండ్ సృష్టిస్తుంది. ప్రస్తుతం 2018లో బెవర్లీ జాబర్ట్ అనే ఫోటోగ్రాఫర్ తీసిన పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఎండలో జీబ్రాలు నడుస్తున్న దృశ్యాన్ని టాప్ యాంగిల్ లో ఫోటో తీశారు బెవర్లీ. ఆ ఎండకు నడుస్తున్న జీబ్రాల నీడలు.. గుర్రాలుగా, గాడిదలుగా కనిపిస్తుండటం విశేషం. అయితే.. ఎక్కువ శాతం ఆ ఫోటో చూసిన వెంటనే.. నీడలనే నిజమైనవి అని అనుకుంటున్నారు. తీరా గమనిస్తే గానీ అవి జీబ్రా నీడలు అని తెలియట్లేదు. ఈ పిక్ నేషనల్ జియోగ్రఫీ ఛానల్ నుండి ‘బెస్ట్ పిక్చర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకుందని కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీనిపై నెటిజన్లు స్పందించి.. ఆ ఫోటో తీసింది బెవర్లీ జాబర్ట్ అని చెబుతున్నారు.
ఇదిలా ఉండగా.. తీసిన నాలుగేళ్లకు ఆ ఫోటో ట్రెండ్ అవుతుండటం ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం. జీబ్రాల నీడలు గుర్రాలుగా కనిపిస్తుండటం అనేది ఫోటోగ్రాఫర్ క్రియేటివిటికి నిదర్శనంగా నిలుస్తుందని చెప్పాలి. అయితే.. ఇలాంటి ఇల్యూషన్ షాడోస్ ఫోటోలు గతంలో చాలా వచ్చాయి. 2008లో కూడా జీబ్రా షాడోస్ సంబంధించి ఓ పిక్ వైరల్ అయింది. మరి ఈ జీబ్రా షాడోస్ ఇమేజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.