ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్ ను మూడు వైపుల నుంచి రష్యా బలగాలను మోహరించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రష్యా దాడితో కీవ్ విమానాశ్రాయాన్ని ఉక్రెయిన్ ఖాళీ చేసింది. తెల్లవారుజాము నుంచే కీవ్ లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా రష్యా విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్ విషయంలో ఎవరు జోక్యం చేసుకున్నా కూడా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పుతిన్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా కూడా తమ ఆత్మరక్షణ కోసమే ఏర్పాట్లు చేసుకున్నట్లు ప్రకటించింది.
ఉక్రెయిన్ బ్రిటన్ ఇప్పటికే మద్దతు తెలిపింది. రష్యా దాడులను తిప్పికొడతామని ప్రకటించిన ఉక్రెయిన్ ఆ దిశగా చర్యలు కూడా ప్రారంభించింది. ఇప్పటికే రష్యాపై ఉక్రెయిన్ ఎదురుదాడి ప్రారంభించింది. దేశంలో మార్షల్ లా విధించింది. రష్యా- ఉక్రెయిన్ చర్యలతో ప్రపంచ దేశాలు ఎప్పుడు ఏం జరుగుతోందో అనే భయాందోళనలో ఉన్నారు. పుతిన చర్యలను అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తీవ్రంగా ఖండించారు.