చికెన్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు.. అందరికీ ఇష్టమే. ఆదివారం వచ్చినా, పార్టీలకు వెళ్లినా చాలా మందికి ముక్క లేకపోతే ముద్ద దిగదు. మరికొందరికైతే.. వారానికి నాలుగు సార్లైనా చికెన్ ముక్కలు ఉండాల్సిందే అంటారు. కానీ అదే చికెన్‌ని రోజూ తినాలంటే.. అబ్బా ఏం తింటాం విరక్తి వచ్చేసింది.. అని కామన్ గా అనే మాట. పైగా రోజూ తింటే.. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. అలాంటిది బ్రిటన్‌కు చెందిన 25 ఏళ్ల సమ్మర్ మొన్రో అనే యువతి మాత్రం గత 22 ఏళ్ల నుంచి రోజు చికెన్ మాత్రమే తింటోంది. తన రోజువారి డైట్‌లో చికెన్ నగ్గెట్స్, చికెన్ ఫ్రై, పొటాటో చిప్స్ ఇవే ఉంటాయి.
అయితే,.. ఇంతలా చికెన్ తినడానికి కారణం ఉందంటోంది సమ్మర్ మొన్రో. ఆమె మాట్లాడుతూ.. గత 22 ఏళ్ల నుంచి అందరిలా.. పండ్లు తినకున్నా.. కూరగాయలు తినకున్నా చాలా ఆరోగ్యంగా ఉన్నానంటోంది. ఎలాంటి సమస్యలు తనకు రాలేదట. ఒకసారి..తనకు మూడు సంవత్సరాల వయస్సులో మెత్తని బంగాళాదుంపలను తినాల్సి వచ్చినప్పుడు ఆమెకు ఫోబియా మొదలైనట్లు చెప్పుకొచ్చింది. మొన్రో.. ఈ ఫోబియా నుంచి బయటపడేందుకు రెండుసార్లు థెరపీని, హిప్నోథెరపీని ప్రయత్నించిందట, కానీ అవేవి ఆమెకు సహాయం చేయలేదట.
ఇది కూడా చదవండి: కరాటే పోటీల్లో వరల్డ్ రికార్డ్ నెలకొల్పిన చిచ్చర పిడుగు..!తనకు ఆహారం వాసన ఇస్టమేనట, కానీ దానిని తినడానికి ప్రయత్నిస్తే.. అది తన పెదాలను తాకగానే మెదడులో కొంత భాగం శారీరకంగా ఆ పని చేయనివ్వట్లేదట.అందుకే.. తాను పండ్లు, కూరగాయలు తినడం మానేసినట్లు చెప్పుకొచ్చింది. అవి చివరిసారిగా ఎప్పుడు తిన్నానో కూడా తనకు గుర్తులేదని తెలిపింది. అయితే తను పాటిస్తున్న డైట్ తనని ఆరోగ్యంగా ఉంచుతోందని అందుకే.. కేవలం చికెన్‌తో చేసిన వంటకాలు, పొటాటో చిప్స్, ఫ్రై పదార్థాలను మాత్రమే తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ విషయం విన్న నెటిజన్స్ రాబోయే జన్మలో నువ్ కోడిగా పుడతావంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.