ఈ మద్య కొంతమంది సెలబ్రెటీలు పాములు, కొండ చిలువలతో తీసుకున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. అంతేకాదు ఓ అడుగు ముందుకు వేసి డేంజర్ అని తెలిసి కూడా వాటికి ముద్దులు పెట్టడం.. మెడలో వేసుకోవడం.. నడుముకు చుట్టుకోవడం లాంటి సాహసాలు చేస్తున్నారను. అవి కొన్ని సార్లు అవి బెడిసి కొట్టడం కూడా చూస్తున్నాం.
తాజాగా పాముతో ఇలాగే సాహసం చేద్దామనుకున్న ఒక యంగ్ సింగర్‌కు చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని జే జెడ్ లేబుల్ రోక్ నేషన్ అనే సంస్థ యంగ్ సింగర్ మేతాతో ఒక మ్యూజిక్ వీడియో షూట్‌ని ప్లాన్ చేసింది. అయితే రొటీన్ కి భిన్నంగా ఓ సాహసం చేయాలని భావించింది సింగర్ మేతాతో. ఇందులో భాగంగా గాయని నేల మీద పడుకుని పాములు ఒంటి మీద వేసుకుంటూ పాటలు పాడాలి. ఇక షూట్‌లో భాగంగా బ్లాక్ కలర్ డ్రెస్ ధరించిన మేతా మొదట్లో కొన్ని పాములను శరీరంపై వేసుకుని పాటలు పాడడం ప్రారంభించింది. కొద్దిసేపటి తర్వాత పాము అమాంతం ఆమె ముఖం మీద కాటు వేసింది.
ఇది కూడా చదవండి : తెలంగాణ ఆర్టీసీకి మహేశ్ బాబును ప్రచార కర్తగా మార్చిన సజ్జనార్
ఒక్కసారిగా భయపడిపోయి పాములను పక్కకు నెట్టేసింది సింగర్. అలర్ట్ కావడం.. ఆమె షూట్ ని ఆపివేశారు. కాకపోతే మేతాను కరచిన పాము విషరహిత సర్పం. దీంతో ఆమెకు ఎలాంటి ప్రాణాపాయం కలగలేదు. అమెరికాలో టిక్‌టాక్ స్టార్‌గా గుర్తింపు ఉన్న మేతాకు సోషల్ మీడియాలో చాలామంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.