తాలిబాన్ ఏలికలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌కు భారత ప్రభుత్వం గోధుమలు ఎగుమతి చేసేందుకు సిద్ధమైంది. కానీ అందుకు పాకిస్తాన్ అనుమతి అవసరమైంది. దీని కారణం దాదాపు 50వేల మెట్రిక్ టన్నుల గోధుమలను పాకిస్తాన్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్‌కు తరలించాల్సి ఉంది. దీనిపై తాలిబన్లు పాకిస్తాన్‌ను అనుమతి కోరారు. శుక్రవారం ఈ విషయంపై నిర్ణయం తీసుకున్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. తన దేశం మీదుగా ఆఫ్ఘనిస్తాన్‌కు భారత్ గోధుమలు రవాణా చేసేందుకు అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. మానవతా ధృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ ప్రధాని తెలిపారు. వాగ్ అత్తరీ బార్డర్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్‌కు భారత్ ఆహారధాన్యాలను సరఫరా చేయనుంది.
#Pakistan PM #ImranKhan (@ImranKhanPTI) said that his country would “favourably” consider the request by the #Taliban-led govt in #Afghanistan for transporting wheat offered by #India through the country on an “exceptional basis” for humanitarian purposes, Dawn reported. pic.twitter.com/ZnLaD4SvEb
— IANS Tweets (@ians_india) November 13, 2021