Dissociative Identity Disorder: ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన సినిమాల్లో ‘అపరిచితుడు’ సినిమాది ఓ ప్రత్యేక స్థానం. ఈ సినిమాలో మానసిక రోగం ఉన్న వ్యక్తిగా విక్రమ్ నటన అద్భుతంగా ఉంటుంది. హీరో రామానుజం స్ల్పిట్ పర్సనాలిటీ అనే ఓ మానసిక రోగంతో బాధపడుతుంటాడు. ఒకే వ్యక్తి కొన్ని వేరువేరు సందర్భాల్లో వేరువేరు వ్యక్తులుగా మారుతుంటాడు. తప్పు చేసిన వాళ్లను శిక్షించటానికి ‘అపరిచితుడు’గా, నందినిని ప్రేమించటానికి ‘రెమో’గా ఇలా ఒకే వ్యక్తి ఇద్దరిగా ప్రవర్తిస్తుంటాడు. ఇది కేవలం సినిమాకు మాత్రమే పరిమితం కాదు.. మల్టిపుల్ పర్సనాలిటీ డిశార్డర్ ఉన్న వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా చాలా మందే ఉన్నారు. ఒకే మనిషిలో పది మంది దాకా పర్సనాలిటీలు ఉన్న వారు కూడా ఉన్నారు. అలాంటివారిలో జర్మనీలోని మునీచ్కు చెందిన లియోనార్డో స్టాకల్ ఒకడు.
డిసోసియేట్ ఐడెంటిటీ డిశార్డర్( మల్టిపుల్ పర్సనాలిటీ డిశార్డర్)తో బాధపడుతున్న ఇతడిలో పది మంది వ్యక్తులున్నారు. 4 ఏళ్ల పిల్లాడినుంచి, 26 కుర్రాడి వరకు ఇతడిలో వయసుల వారీగా పర్సనాలీలు ఉన్నాయి. కోవు(4), హెక్టార్(8), యానా(16), కోస్మో(17), యాష్(18), జెస్సీ(19), లియో(21), బెల్లీ(23), లివ్(24), రెడ్(26)లు లియోనార్డోలో దాగి ఉన్న వ్యక్తులు. వీరు ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వస్తుంటారు. దీంతో అతడి జీవితం అస్తవ్యస్తం అవుతోంది. సరిగ్గా చదవలేకపోతున్నాడు, పని చేసుకోలేకపోతున్నాడు, ఇంట్లోంచి ఒంటరిగా బయటకు కూడా వెళ్లలేకపోతున్నాడు. ఎప్పటి కప్పుడు పర్సనాలిటీలు మారుతుండటం వల్ల మెమోరీ లాస్ అవుతోంది. తద్వారా చదువులు పాడవుతున్నాయి. దీనికి తోడు తనలోని ఒక్కో వ్యక్తికి ఒక్కో రకమైన కోరికలు ఉన్నాయి. ఇలా వారందరి కోర్కెలు తీర్చటానికి నానా ఇబ్బందులు పడుతున్నాడు.
ఇతడికి ఈ మానసిక వ్యాధి ఎలా వచ్చిందంటే.. అపరిచితుడు సినిమాలో లాగే ఇతడు కూడా చిన్న తనంలో ఓ పెద్ద షాక్‌కు గురయ్యాడు. దీంతో డిసోసియేట్ ఐడెంటిటీ డిశార్డర్ వచ్చింది. లియోనార్డో తన శరీరాన్ని ఓ సిస్టమ్‌లాగా భావిస్తున్నాడు. ఇక తనలోని పది మందిని ఆ సిస్టమ్‌లోని వ్యక్తులుగా అనుకుంటున్నాడు. ఇక, తనను తాను అప్పుడప్పుడు వచ్చిపోయే ఓ అతిధిలా భావిస్తున్నాడు. పది పర్సనాలిటీలు లేకుండా తన జీవితాన్ని ఊహించుకోలేనని లియో అంటున్నాడు. వాళ్లను తన స్నేహితుడు, టీం, ఫ్యామిలీ మెంబర్లుగా పేర్కొంటున్నాడు. వాళ్లు లేకుండా బతక లేనని అంటున్నాడు. మరి, లియోనార్డోకు ఉన్న 10 పర్సనాలిటీలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Ireland: రెచ్చిపోయిన వృద్ధుడు.. పనయ్యాక గతం మర్చిపోయాడు!