ప్రతి మనిషికి అన్నీ అనుకూలంగా ఉండవు. జీవితం, ఉద్యోగం వంటి విషయాల్లో కూడా అందరికి ఓకేలా ఉండదు. ఇటీవల కరోనా కాలంలో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఏ పని దొరక్క దిక్కుతోచని స్థితిలో ఎంతో మంది యువత ఉంది. ఏ పని దొరికితే ఆ పని చేస్తున్నారు. కొందరికి ఇలాంటి కష్టాల్లో నుంచి కొత్త ఆలోచన పుట్టుకొచ్చి వేలాది రూపాయలు సంపాదిస్తారు. బ్రిటన్ కు చెందిన ఫ్రెడ్డీ బెక్కెట్ అనే వ్యక్తి అలాంటి ఓ కొత్త ఆలోచనతో పనిచేసి రోజుకు వేల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఆ వైరైటి ఆలోచన ఎంటో, ఎలా అంతా డబ్బు సంపాదిస్తున్నాడో చూద్దాం.
బ్రిటన్ కు చెందిన ఫ్రెడ్డీ బెక్సెట్ అనే వ్యక్తి రోజులో గంటల కొద్ది క్యూలైన్ లో నిలబడటం.. తన వంతు వచ్చిన తరువాత కావాల్సిన వస్తువులను కొని తీసుకొని వెళ్తుంటాడు. ఇలా కొనుగోలు చేసిన వస్తువులను ఎవరైతే కొనుగోలు చేయమన్నారో వారికి అందిస్తాడు. దీనికి ప్రతిగా అతనికి రూ. 16 వేల వరకు అందిస్తారట. ధనవంతులైన వారికి ఈ సేవ చేస్తూ తాను డబ్బులు సంపాదిస్తున్నట్టు ఫ్రెడ్డీ పేర్కొన్నాడు. ధనవంతులు గంటల తరబడి క్యూలైన్లో నిలబడలేరు. అంత సమయం కూడా ఉండదు. వారి అవసరాన్ని నేను అవకాశంగా మార్చుకుని.. ఈ సేవ చేస్తున్నట్లు ఫ్రెడ్డీ తెలియజేశాడు. ఫ్రెడ్డీ చేసే ఈ వైరైటీ ఉద్యోగంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.