ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తుంది. గత రెండేళ్ల నుంచి కరోనా కాటుకు ఎంతో మంది బలయ్యారు. ఎప్పటికప్పుడు కొత్తగా రూపు మార్చుకుంటూ కరోనా మనిషికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఒక దశలో ఈ మహమ్మారి ఎందరో జీవితాలను ప్రభావితం చేసేసింది. ముఖ్యంగా ఈ ప్రభావం ఎక్కువగా ఉద్యోగస్తులపై పడింది.. చాలా మంది ఇంటి నుంచే పనిచేయాల్సిన పరిస్థితి. తాజాగా అమెరికాలో వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్న ఓ జర్నలిస్ట్ ఊహించని అతిథిని అందరికీ పరిచయం చేసి అందరి మొహాల్లో చిరునవ్వులు వచ్చేలా చేశారు.
వివరాల్లోకి వెళితే.. విస్కాన్సిన్స్ లోని మిల్వాకీకి చెందిన రెబెక్కా షూల్డ్ (42) సీబీఎస్ న్యూస్ లో పనిచేస్తున్నారు. ఈ మద్య అమెరికా వాతావరణంలో ఎన్నో మార్పులు చేర్పులు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో సీబీఎస్ న్యూస్ లో పనిచేస్తున్న రిపోర్టర్లు అలర్ట్ గా ఉంటున్నారు. ఈ క్రమంలో స్కాన్సిన్స్ లోని మిల్వాకీకి చెందిన రెబెక్కా షూల్డ్ తన 3 నెలల బిడ్డను ఎత్తుకుని వాతావరణ వివరాలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సరిగ్గా తన డ్యూటీ టైంకు పాప నిద్ర నుంచి లేవడంతో.. పాపను ఎత్తుకుని లైవ్ లోకి రావాల్సి వచ్చిందని.. గాఢమైన నిద్రలో ఉన్న నా బిడ్డ అప్పుడే లేచింది. ఏం చేయాలో తోచలేదని అన్నారు.
బిడ్డను తీసుకొచ్చే సరికి కార్యక్రమ ప్రొడ్యూసర్ ఒక్కసారే షాక్ తిన్నారు. పాపను పరిచయం చేస్తున్నావా ఏంటి? అంటూ అడిగారు. చాలా సేపు పడుకుని లేచిందిగా.. ఇబ్బంది పెట్టదులే అని ఆమెకు చెప్పాను. ఆ తర్వాత వెదర్ ఫోర్ కాస్ట్ సక్సెస్ అయింది అని రెబెక్కా తెలిపారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Meteorologist Rebecca Schuld, of CBS Milwaukee affiliate WDJT, brought her 13-week-old daughter Fiona on-air for a sweet moment during her forecast. https://t.co/IdXfeFYVDF pic.twitter.com/w9kV6oRBWC
— CBS News (@CBSNews) February 3, 2022